Kia SeltosL కియా ఇండియా త్వరలో అధికారికంగా లాంచ్ చేయనున్న కొత్త తరం Kia Seltos SUVకి సంబంధించిన వేరియంట్ వారీ ఫీచర్లను ప్రకటించింది. HTE, HTE (O), HTK, HTK (O), HTX, HTX (A), GTX, GTX (A) వంటి అనేక ట్రిమ్‌లతో ఈ SUV అందుబాటులోకి రానుంది. నేటి నుండి బుకింగ్స్ రూ. 25,000 అడ్వాన్స్‌తో ప్రారంభమయ్యాయి. మరి ప్రతి వేరియంట్ కార్స్ లో లభించే ముఖ్య ఫీచర్లను చూసేద్దామా..
HTE:
ప్రారంభ స్థాయి HTE వేరియంట్ మంచి భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, TPMS, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్‌బెల్ట్స్ లభిస్తాయి. అలాగే LED హెడ్లైట్స్, DRLs, LED టెయిల్ ల్యాంప్స్, 16 అంగుళాల వీల్స్ అందించబడ్డాయి. విటీతోపాటు రియర్ వ్యూ కెమెరా, షార్క్-ఫిన్ యాంటెన్నా, రియర్ స్పాయిలర్ కూడా ఉన్నాయి. ఇంటీరియర్‌లో బ్లాక్-గ్రే అఫోల్స్టరీ, మాన్యువల్ డ్రైవర్ హైట్ అడ్జస్ట్మెంట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, 12 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ లభిస్తాయి. కీ లెస్ ఎంట్రీ, మాన్యువల్ AC, రియర్ AC వెంట్‌లు, USB-C పోర్టులు, ఎలక్ట్రిక్ ORVMs కూడా ఇందులో ఉన్నాయి.
AI ఇమేజింగ్, 7100mAh బ్యాటరీ, HDR+ డిస్‌ప్లేతో గేమ్ ఛేంజర్ HONOR Magic8 Pro లాంచ్..
HTE (O):
బేస్ వేరియంట్ కంటే HTE (O) వేరియంట్ మరిన్ని సౌకర్యాలు తీసుకొస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్‌లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్స్, పార్ట్ లెదరెట్ సీట్స్ అందుబాటులో ఉంటాయి. ఆటోమేటిక్‌లో ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌లు, ప్యాడిల్ షిఫ్టర్లు లభిస్తాయి. వీటితోపాటు 60:40 స్ప్లిట్ రియర్ సీట్, మిడిల్ ప్యాసింజర్ హెడ్‌రెస్ట్, సీట్బ్యాక్ పోకెట్స్ కూడా అమర్చబడ్డాయి.
HTK:
HTK వేరియంట్‌లో ప్రీమియం టచ్‌లు మరింత కనిపిస్తాయి. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటో-ఫోల్డింగ్ ORVMs, రియర్ వైపర్, డీఫాగర్, ప్రాక్సిమిటీ స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ డోర్ హ్యాండిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటీరియర్‌లో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, రియర్ డోర్ సన్‌షేడ్స్, రియర్ పార్సెల్ ట్రే ఉన్నాయి.
HTK (O):
HTK (O) మరింత అప్గ్రేడెడ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, లెదరెట్ అఫోల్స్టరీ, వైర్‌లెస్ ఛార్జింగ్, పానొరామిక్ సన్‌రూఫ్, లెదరెట్ స్టీరింగ్ వీల్ లభిస్తాయి. ఆటోమేటిక్ వేరియంట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8 వే ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ లభిస్తుంది.
SIR: 5 రాష్ట్రాలు, ఒక యూటీలో SIR గడువు పొడగించిన ఎన్నికల సంఘం..
HTX:
HTX వేరియంట్ SUVకి స్టైల్, టెక్నాలజీ లెవల్‌ను పెంచుతుంది. గ్లోసీ బ్లాక్ గ్రిల్, బ్లాక్ ORVMs, LED ఫాగ్ లైట్స్, సైడ్ డోర్ గార్నిష్ అందుబాటులో ఉన్నాయి. ఇంటీరియర్‌లో బ్రౌన్-గ్రే అఫోల్స్టరీ, లెదరెట్ డ్యాష్‌బోర్డ్, అంబియెంట్ లైటింగ్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్, OTA అప్‌డేట్స్, HVAC కంట్రోల్ కోసం ప్రత్యేక 5 అంగుళాల స్క్రీన్ ఉన్నాయి. ఆటోమేటిక్ వేరియంట్‌లో వెంటిలేటెడ్ సీట్లు, పవర్ డ్రైవర్ సీట్, 8 స్పీకర్ BOSE ఆడియో సిస్టమ్ లభిస్తాయి.
HTX (A):
HTX (A) వేరియంట్‌లో లెవెల్ 2 ADAS టెక్నాలజీ ఉంది. స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్-అండ్-గో, పార్కింగ్ కొల్లిజన్ అవాయిడెన్స్, రివర్స్ కొల్లిజన్ అవాయిడెన్స్, అదనపు సైడ్ సెన్సర్లు, 360-డిగ్రీ కెమెరా, 12.3 అంగుళాల డిజిటల్ క్లస్టర్ వంటివి అందుబాటులో ఉన్నాయి.
GTX, GTX (A):
GTX వేరియంట్‌లో స్పోర్టీ ఎలిమెంట్లు ఎక్కువ. LED ప్రోజెక్టర్ హెడ్లైట్స్, గ్లోసీ బ్లాక్ బంపర్స్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, నియాన్ బ్రేక్ కాలిపర్స్ లభిస్తాయి. ఇంటీరియర్‌లో బ్లాక్-వైట్ అఫోల్స్టరీ, 10 వే ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్, డ్రైవర్ సీట్, ORVMలకు మెమరీ ఫీచర్ ఉన్నాయి. GTX (A) వేరియంట్‌కి ADAS ప్యాక్ కూడా చేరుతుంది.
X-Line:
GTX, GTX (A) కోసం లభించే X-Line ప్యాక్ SUVకి ప్రత్యేక లుక్ అందిస్తుంది. గ్లోసీ బ్లాక్ స్కిడ్ ప్లేట్స్, గన్‌మెటల్ యాక్సెంట్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. కేబిన్‌లో బ్లాక్-గ్రీన్ లెదరెట్ సీట్లు, ప్రత్యేక అరోరా బ్లాక్ పెర్ల్, ఎక్స్క్లూజివ్ మాట్టే గ్రాఫైట్ రంగులు జత చేసారు.
