NTV Telugu Site icon

Mahindra Scorpio-N: “బిగ్ డాడీ” వచ్చేస్తోంది.. నేడే లాంచింగ్

Scarpio N

Scarpio N

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న, ప్రతిష్టాత్మకమై మహీంద్రా స్కార్పియో ఎన్ వచ్చేస్తోంది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్ యూ వీస్ గా పిలిచే స్కార్పియో-ఎన్ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు లాంచ్ కాబోతోంది. గతంలో ఉన్న మోడల్ కన్నా మరింత అధునాతనంగా, మరిన్ని ఫీచర్లలో స్కార్పియో ఎన్ రాబోతోంది. ఈ కార్ విడుదల కాకముందే చాలా మంది బుకింగ్ చేసుకున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కార్పియో కన్నా స్కార్పియో ఎన్ ధర ఎక్కువగానే ఉంది. ఎస్ యూ వీ డైమెన్షన్స్, ఫీచర్లు పెరగడంతో ధర కూడా పెరిగింది. ప్రస్తుతం స్కార్పియో- ఎన్ ఎక్స్ షోరూం ధర రూ. 13.65 లక్షల నుంచి ప్రారంభం అయి టాప్ వేరియంట్ 19 లక్షల వరకు ఉంది. కొన్ని మోడల్స్ లో ఫోర్ వీల్ డ్రైవ్ కూడా ఉంది. లో-రేంజ్ గేర్ బాక్స్ తో పాటు మెకానికల్లీ లాక్డ్ డిఫరెన్షియల్ కొత్త స్కార్పియోలో అమర్చారు. దీంట్లో రఫ్ రోడ్, స్నో, మడ్, వాటర్ మొదలైన మల్టీ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

థర్డ్ జెనరేషన్ రెండిషన్ తో వస్తున్న స్కార్పియోలో మోడళ్లను బట్టి రెండు ఇంజిన్లు ఉన్నాయి. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ తో పాటు 2.2 లీటర్ ఎంహాక్ డిజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ , ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ తో స్కార్పియో ఎన్ లో ఉన్నాయి.  ఇక ఎస్ యూ వీ ఇంటీయర్ కూడా గతంలో దాని కన్నా ఎంతో ఆకర్షణీయంగా తీర్చదిద్దారు. పెద్ద సైజ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ తో పాటు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు స్పార్పియో ఎన్ లో ఉన్నాయి. స్కార్పియో ఎన్ డైమెన్షన్స్ ను పరిశీలిస్తే పొడవు 4,622 మిమీ కాగా వెడల్పు 1,917 మీమీ, ఎత్తు 1,870 మీమీ గా ఉంది.