204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
- మిత్సుబిషి పాజెరో కొత్త ఐదో తరం మోడల్‌గా రీఎంట్రీ
- కొత్త పాజెరోను 7-సీటర్ ఫ్లాగ్షిప్ ఆఫ్‌రోడ్ SUVగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mitsubishi Pajero: జపాన్ ఆటోమొబైల్ సంస్థ మిత్సుబిషి (Mitsubishi) తన ఐకానిక్ పాజెరో SUVని ఐదో తరం మోడల్‌గా తీసుక వచ్చింది. కొత్త పజెరోను కంపెనీ ఫ్లాగ్షిప్ 7-సీటర్ ఆఫ్‌రోడ్ SUVగా తీసుకొస్తోంది. మిత్సుబిషి ట్రిటోన్ పికప్ ట్రక్ ఆధారంగా రూపొందించిన ల్యాడర్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్‌పై ఈ SUVను అభివృద్ధి చేశారు. తొలుత థాయ్‌లాండ్‌లో విడుదల కానున్న కొత్త పజెరో.. 2027 మార్చి చివరి నాటికి జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో మాత్రం ఈ SUV విడుదలయ్యే అవకాశాలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి.
రగ్గడ్ డిజైన్:
ఈ కొత్త SUVలో గత తరాల డిజైన్‌ను కొనసాగించకుండా, కంపెనీకి చెందిన Xforce, Destinator వంటి కొత్త SUVల డిజైన్ లాంగ్వేజ్‌ను మరింత రగ్గడ్‌గా తీర్చిదిద్దారు. ముందు భాగంలో వెడల్పాటి గ్రిల్, పెద్ద వీల్ ఆర్చ్‌లు, బలమైన లోయర్ బాడీ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఫ్లాట్ రూఫ్‌లైన్, పెద్ద గ్లాస్ ఏరియా కారణంగా క్యాబిన్లో విశాలమైన అనుభూతితో పాటు మెరుగైన విజిబిలిటీ లభించేలా డిజైన్ చేశారు. సైడ్ స్టెప్స్, మడ్ ఫ్లాప్స్, ఎత్తైన సస్పెన్షన్ వంటివి SUV ఆఫ్‌రోడ్ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Also Read
- Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
- TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
కొత్త పజెరో పొడవు 4,920 మిల్లీమీటర్లు, వెడల్పు 1,925 మిల్లీమీటర్లు కాగా, ఎత్తు 1,910 మిల్లీమీటర్లుగా ఉంది. వీల్‌బేస్ 2,870 మిల్లీమీటర్లు. వేరియంట్‌ను బట్టి 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. పాత పజెరో మాదిరిగా వెనుక భాగంలో స్పేర్ వీల్‌తో కూడిన సంప్రదాయ డిజైన్‌కు బదులుగా కొత్త మోడల్లో సాధారణ టెయిల్‌గేట్, బాడీ కింద స్పేర్ వీల్ ఏర్పాటు చేశారు.
7-సీటర్ క్యాబిన్:
లోపల మూడు వరుసల్లో ఏడు సీట్ల లేఅవుట్ ఉంటుంది. రెండో వరుస సీట్లను 150 మిల్లీమీటర్ల వరకు ముందుకు, వెనుకకు స్లైడ్ చేయవచ్చు. అవసరాన్ని బట్టి వాటిని ముందుకు మడవడం ద్వారా మూడో వరుసలోకి సులభంగా వెళ్లేందుకు లేదా లగేజీ స్పేస్‌ను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. హైయర్ వేరియంట్లలో లెదర్ సీట్లు, సాఫ్ట్‌టచ్ డ్యాష్‌బోర్డ్, గ్రాబ్ హ్యాండిల్స్, డబుల్ గ్లేజ్డ్ సైడ్ విండోస్, అకౌస్టిక్ విండ్‌షీల్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ట్రై-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సన్‌షేడ్స్, హీటెడ్ సెకండ్-రో సీట్లు, కూల్డ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
డ్యాష్‌బోర్డ్‌పై హైయర్ వేరియంట్లలో రెండు 14.3 అంగుళాల డిస్ప్లేలు ఉంటాయి. బేస్ వేరియంట్లలో 12.3 అంగుళాల స్క్రీన్లు లభిస్తాయి. క్లైమేట్ కంట్రోల్ వంటి తరచుగా ఉపయోగించే ఫంక్షన్లకు ఫిజికల్ బటన్లను కొనసాగించారు. 4WD సెట్టింగ్స్ కోసం రోటరీ కంట్రోలర్ ఇచ్చారు. మూడు వరుసల్లోనూ USB ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. 12-స్పీకర్ యమహా ఆడియో సిస్టమ్ కూడా లభిస్తుంది.
204hp డీజిల్ ఇంజిన్:
కొత్త పజెరోకు 2.4 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజిన్ అందించారు. ఇదే ఇంజిన్‌ను ట్రిటోన్ లో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే పజెరోలో ఇది 204hp పవర్, 480Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రిటోన్ తో పోలిస్తే టార్క్ 10Nm ఎక్కువ. ఈ ఇంజిన్‌కు కొత్త తరం 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. కొత్త Pajero, Triton ల్యాడర్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందినప్పటికీ.. మరింత హై-టెన్సైల్ స్టీల్‌ను ఉపయోగించి నిర్మాణాన్ని దృఢంగా తీర్చిదిద్దారు. దీని వల్ల ఆన్‌రోడ్ హ్యాండ్లింగ్, ఆఫ్‌రోడ్ పనితీరు, దీర్ఘకాలిక మన్నిక మెరుగుపడేలా డిజైన్ చేశారు. ముందు భాగంలో హై-మౌంటెడ్ డబుల్ విష్బోన్ సస్పెన్షన్, వెనుక భాగంలో ఫైవ్-లింక్ రిజిడ్ యాక్సిల్ సెటప్ ఉంది. 230mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో పాటు 30.4 డిగ్రీల అప్రోచ్ యాంగిల్, 22.6 డిగ్రీల బ్రేక్ఓవర్ యాంగిల్, 25.8 డిగ్రీల డిపార్చర్ యాంగిల్ ఉన్నాయి.
తాజావార్తలు
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!