NTV Telugu Site icon

MG ZS EV: భారీగా తగ్గిన ఎంజీ జెడ్ఎస్ ఈవీ కార్ ధరలు..ఏకంగా రూ. 2 లక్షల వరకు ఆదా..

Mg Zs Ev

Mg Zs Ev

MG ZS EV: ఇండియన్ కార్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్‌లో టాటా లీడింగ్ కంపెనీగా ఉంది. అయితే టాటా తర్వాత ఎంజీ నుంచి వచ్చి ZS EV కార్ ఎక్కువగా అమ్ముడైంది. MG ZS EV హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు BYD అట్టో 3 వంటి మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ SUVలతో పోటీపడుతుంది. మరోవైపు టాటా కంపెనీ నెక్సాన్ ఈవీని టాప్ వేరియంట్‌ని కేవలం రూ.20 లక్షల లోపే అందిస్తుండటంతో ఈవీ కార్ కొనాలనుకునే వారు టాటా వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో MG మోటార్స్ తన ఎలక్రిక్ ఎస్‌యూవీ MG ZS EVపై భారీగా ధరలు తగ్గించబోతోంది. రూ. 2.30 లక్షల వరకు ధరలు తగ్గుతున్నాయి. జనవరి 2020లో మార్కెట్ లోకి వచ్చిన MG ZS EV అనతి కాలంలో మంచి ప్రజాధరణ పొందింది. ఇప్పటి వరకు 11,000 యూనిట్లను అమ్మకాలు జరిగాయి.

MG ZS EV ప్రస్తుతం మూడు వేరయంట్లలో లభిస్తోంది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధరల వివరాలను పరిశీలిస్తే

వేరియంట్                       కొత్త ధర                 పాత ధర                     డిఫరెన్స్..

ZS EV Excite              రూ.22.88 లక్షలు    రూ. 23.38 లక్షల     రూ. 50,000

ZS EV ఎక్స్‌క్లూజివ్     రూ.25 లక్షలు          రూ. 27.30 లక్షలు    రూ. 2.30 లక్షలు

ZS EV ఎక్స్‌క్లూజివ్
డ్యూయల్-టోన్        రూ. 25.10 లక్షలు     రూ. 27.40 లక్షలు     రూ. 2.30 లక్షలు

ఎక్స్‌క్లూజివ్ ప్రో        రూ. 25.90 లక్షలు      రూ. 27.90 లక్షలు     రూ. 2 లక్షలు

ఎక్స్‌క్లూజివ్ ప్రో
డ్యూయల్-టోన్         రూ. 26 లక్షల            రూ. 28 లక్షల              రూ. 2 లక్షలు

ఫీచర్లు: 

MG ZS EV 176.75PS మరియు 280Nm టార్క్‌ని అందించే పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను ఉంటుంది. ఈ మోటారు 50.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 461కిమీ వరకు ప్రయాణించేలా చేస్తుంది. కేవలం 8.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్స్ డైవింగ్ మోడ్స్ ఉంటాయి.

LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, 7-ఇంచ్ అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ , 10.1-ఇంచ్ HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్‌ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ADAS టెక్నాలజీని కలిగి ఉంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందిస్తోంది.