NTV Telugu Site icon

MG MAJESTOR: ఫార్చ్యూనర్‌కు పోటీగా కొత్త ఎస్‌యూవీ.. లుక్ అదుర్స్

Mg

Mg

టయోటా ఫార్చ్యూనర్ ఇండియన్ మార్కెట్లో శక్తివంతమైన ఎస్‌యూవీ సెగ్మెంట్‌. మరే ఇతర కంపెనీ ముందు దాని ముందు నిలవలేదు. అటువంటి పరిస్థితిలో ఫార్చ్యూనర్ ను సవాలు చేసేందుకు.. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన మొదటి డీ ప్లస్ సెగ్మెంట్‌ను ఎస్‌యూవీ ఎంజీ మెజిస్టర్‌ను ఆవిష్కరించింది. మెజిస్టర్ పరిమాణంలో చాలా పెద్దగా ఉంది. పొడవు, ఎత్తు కూడా బాగానే ఉంది. దీని డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది.

READ MORE: Gold Price: పసిడి ప్రియులకు షాక్.. కొండెక్కిన ధరలు.. ఎంతంటే..!

ఎంజీ మెజిస్టర్ విలాసవంతమైన కారు. ఇందులో సౌకర్యవంతమైన సీట్లు అలాగే క్యాబిన్ స్పేస్ పుష్కలంగా ఉంది. ఇది ఇతర వాహనాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని ఇంజన్ కూడా చాలా శక్తివంతమైనది. ఆఫ్‌ రోడ్డులో కూడా ప్రయాణించగలదు. కంపెనీ భద్రతపై కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంది. కంపెనీ.. ఇందులో హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్, ఐసీ ఇంజిన్‌తో సహా వివిధ పవర్‌ట్రెయిన్ మోడల్‌లు ప్రవేశపెట్టింది. 9 కొత్త గ్లోబల్ మోడళ్లను కూడా పరిచయం చేసింది.

READ MORE: Anakapalli: మీడియా స్టిక్కర్ పెట్టుకుని కారులో గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్

అమ్మకానికి ఉన్న మాక్సస్ డీ90 ఎస్​యూవీ ఆధారంగా ఈ ఎంజీ మెజెస్టర్​ని రూపొందించింది సంస్థ. ఈ మోడల్​ సెగ్మెంట్​లోనే పొడవైన, వెడల్పైనది అని సంస్థ చెబుతోంది. దీని ముందు భాగంలో భారీ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. దీనికి గ్లాస్ బ్లాక్​ లో ఫినిషింగ్​ వచ్చింది. స్ప్లిట్-హెడ్ ల్యాంప్ డిజైన్ ఉంది. ఇక్కడ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ పైన ఉంది. మెయిన్​ హెడ్​ల్యాంప్ క్లస్టర్ బంపర్​లో నిలువుగా వస్తోంది. ఎంజీ మెజెస్టర్​లో 12.3 ఇంచ్​ ఫ్రీస్టాండింగ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, పానొరమిక్​ సన్​రూఫ్​, ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ కనసోల్​, 3 జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, వైర్​లెస్​ మొబైల్​ ఛార్జింగ్​ సెటప్​తో పాటు మరెన్నో ఫీచర్స్​ ఉంటాయి.

READ MORE:

Anakapalli: మీడియా స్టిక్కర్ పెట్టుకుని కారులో గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్

ఇక సేఫ్టీ విషయానికొస్తే ఈ భారీ ఎస్​యూవీలో లెవల్​ 2 ఏడీఏఎస్, 6 ఎయిర్​బ్యాగ్​లు, హిల్​ హోల్డ్​ కంట్రోల్​, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ ప్రోగ్రామ్​, హిల్​ డిసెంట్​ కంట్రోల్​, డ్రైవర్​ ఫాటిగ్​ వార్నింగ్​, ట్రాక్షన్​ కంట్రోల్​, రోల్​ మూవ్​మెంట్​ ఇంటర్వెన్షన్​, ఎలక్ట్రిక్​ పార్కింగ్​ బ్రేక్​ విత్​ ఆటో హోల్డ్​, 360 డిగ్రీ వ్యూ కెమెరా వంటి ఫీచర్స్​ సైతం ఉన్నాయి. కాగా మెకానిక్స్​ పరంగా గ్లోస్టర్​తో పోల్చితే ఎంజీ మెజెస్టర్​లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 2 లీటర్​, ట్విన్​ టర్బో డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 213 బీహెచ్​పీ పవర్​ని, 478 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.