కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!

  • MG Cyberster Couture Edition, MG M9 Couture Edition లాంచ్..
  • ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తాతో కలిసి రూపొందించిన ప్రత్యేక ఎడిషన్‌లు.
  • ప్రతి మోడల్‌కు కేవలం 50 యూనిట్లు మాత్రమే అందుబాటులో..
Mg

Mg

MG Cyberster, M9 Couture Edition: JSW ఎంజి మోటార్ ఇండియా (JSW MG Motor India) భారత మార్కెట్లో ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లైన MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ (MG Cyberster Couture Edition), MG M9 కౌచర్ ఎడిషన్ (MG M9 Couture Edition) ప్రత్యేక ఎడిషన్‌లను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా (Gaurav Gupta)తో కలిసి రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు ప్రత్యేక డిజైన్, లగ్జరీ ఫినిష్‌తో రూపుదిద్దుకున్నాయి. అయితే ప్రతి మోడల్‌కు కేవలం 50 కార్లు మాత్రమే అమ్మబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ధరలు:

MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ ధర రూ.87.49 లక్షలు, MG M9 కౌచర్ ఎడిషన్ ధర రూ.84.94 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. ఈ రెండు మోడళ్లు తమ స్టాండర్డ్ వేరియంట్‌ల కంటే రూ.4.99 లక్షలు అధిక ధరతో వీటిని అందుబాటులోకి వచ్చాయి. జూలై 20 నుంచే బుకింగ్‌లు ప్రారంభం కాగా.. ఈ కార్ల డెలివరీలు ఆగస్టు 10 నుంచి మొదలు కానున్నాయి. వీటిని దేశంలోని 14 నగరాల్లో ఉన్న “MG సెలెక్ట్” ప్రీమియం షోరూమ్‌ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్:

ఈ MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ లో తెలుపు రంగును బేస్‌గా తీసుకుని బాడీపై ఆకర్షణీయమైన ఆరెంజ్ స్ట్రీక్స్ పొందుపరిచారు. బోనెట్‌పై సర్పెంట్ ఇన్ఫినిటీ బ్యాడ్జ్‌లు, టోనో కవర్‌పై ప్రత్యేక ఎంబ్రాయిడరీ, ముందు-వెనుక భాగాల్లో గోల్డ్ ఫినిష్ MG లోగోలు ఈ ఎడిషన్‌కు ప్రత్యేక గుర్తింపును అందిస్తున్నాయి.

MG M9 కౌచర్ ఎడిషన్:

ఈ MG M9 కౌచర్ ఎడిషన్లో కూడా తెలుపు రంగుతో పాటు చార్కోల్ కలర్ స్ట్రీక్స్ అందించారు. ముందు బంపర్‌పై సర్పెంట్ ఇన్ఫినిటీ (Serpent Infinity) బ్యాడ్జ్, MG లోగోకు ఇరువైపులా పౌరాణిక రెక్కలున్న పాంథర్ ఆకారంలోని బ్రోచెస్ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇంటీరియర్‌లో డ్యాష్‌బోర్డ్‌పై కౌచర్ ఎడిషన్ (Couture Edition) బ్రాండింగ్‌ను అందించారు. మిగతా క్యాబిన్ డిజైన్ మాత్రం స్టాండర్డ్ M9 మోడల్‌లాగే ఉంటుంది.

ఈ ప్రత్యేక ఎడిషన్‌లలో డిజైన్ పరంగా మాత్రమే మార్పులు చేశారు. మెకానికల్ స్పెసిఫికేషన్లు మాత్రం స్టాండర్డ్ మోడల్‌లాగే కొనసాగుతున్నాయి. MGసైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్లో 77kWh బ్యాటరీ ప్యాక్‌తో డ్యూయల్ మోటార్ AWD సిస్టమ్ ఉంటుంది. ఇది 510bhp పవర్, 725Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 580 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. అదే కౌచర్ ఎడిషన్లో 90kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన సింగిల్ మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్ ఉంది. ఇది 245bhp పవర్, 350Nm టార్క్ అందిస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 548 కి.మీ. వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.