NTV Telugu Site icon

MG Astor Blackstorm: ఎంజీ ఆస్టర్ నుంచి బ్లాక్ ఎడిషన్.. ధర ఎంతంటే..?

Mg Astor

Mg Astor

MG Astor Blackstorm: పండగ సీజన్ వస్తుండటంతో అన్ని కార్ కంపెనీలు తమ కార్లను లాంచ్ చేస్తున్నాయి. కొత్త కొత్త ఎడిషన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మోరిస్ గారేజ్(ఎంజీ) కూడా కొత్త కారుతో మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ఎంజీ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ ఆస్టర్ ని న్యూ అవతార్ లో తీసుకురాబోతోంది. బ్లాక్ ఎడిషన్ లో వస్తోంది. “ఎంజీ ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్” పేరుతో ఈ కారును తీసుకువస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హై‌రైడర్, ఫోక్స్ వ్యాగన్ టైగున్ కి ఎంజీ ఆస్టర్ పోటీ ఇవ్వనుంది.

ధర విషయానికి వస్తే ఎంజీ ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ ధర రూ. 14.48 లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉందని సంస్థ ప్రకటించింది. రాబోయే పండగ సీజన్ ను లక్ష్యంగా చేసుకుని కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ని ఎంజీ తీసుకువస్తోంది. 2021లో ఎంజీ ఆస్టర్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్లలో పోటీలో ఉంది.

Read Also: One Nation-One Election: రామ్ నాథ్ కోవింద్‌తో అమిత్ షా సమావేశం

ఎంజీ ఆస్టర్ బ్లాక్ ఎడిషన్ 5 స్పీడ్ ఎంటీ, సీవీటీతో 1.5-లీటర్ VTi-TECH పెట్రోల్ ఇంజన్ (110PS మరియు 144Nm) కలిగి ఉంది. 2లిమిటెడ్ ఎడిషన్ లో పాత ఆస్టర్ లో ఉన్నటువంటి 1.4 లీటర్ 220 టర్బో ఇంజన్ మిస్ అవుతుంది. బ్లాక్ స్టార్మ్ ఎంటీ – రూ. 14.48 లక్షలకు, బ్లాక్ స్టార్మ్ సీవీటీ రూ. 15.77(ఎక్స్ షోరూం) ధరను కలిగి ఉంది. అట్రాక్టివ్ బ్లాక్ కలర్ తో కొత్త ఎంజీ ఆస్టర్ స్టైలిష్ గా ఉంది. బ్లాక్-అవుట్ హనీకోంబ్ గ్రిల్, రెడ్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన అల్లాయ్ వీల్స్, బ్లాక్-ఫినిష్డ్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్-ఫినిష్ రూఫ్ రెయిల్‌లు, గ్లోసీ బ్లాక్ డోర్ గార్నిష్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో కొత్త ఎడిషన్ ఉంది.