ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mercedes-Benz GLC 400 Electric SUV Launched: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) భారత మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. Mercedes-Benz GLC 400 4MATIC పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారును రూ.78.50 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో అందుబాటులోకి తెచ్చింది. ఈ మోడల్ ప్రత్యేకత ఏమిటంటే.. భారత్‌లోనే స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన తొలి GLC ఎలక్ట్రిక్ SUV ఇది. పుణె సమీపంలోని చకన్ తయారీ కేంద్రంలో ఈ కారు అసెంబ్లింగ్ ప్రారంభమైంది.
711 కి.మీ రేంజ్
Mercedes-Benz GLC 400 4MATICలో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సెటప్‌ను అందించారు. ఈ రెండు మోటార్లు కలిపి 360 kW పవర్, 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ SUV కేవలం 4.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 94 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే WLTP ప్రమాణాల ప్రకారం గరిష్ఠంగా 711 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ SUVలో 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను అందించారు. దీనివల్ల 330 kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ లభిస్తుంది. అనుకూలమైన పరిస్థితుల్లో కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 303 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను పొందవచ్చని మెర్సిడెస్ వెల్లడించింది. అయితే ఛార్జర్ సామర్థ్యం, బ్యాటరీ ఉష్ణోగ్రత, ఛార్జింగ్ స్థాయిని బట్టి ఈ ఫలితాలు మారుతాయి.
Also Read
- AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
- హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
- TVS Apache RTR 125 LC: EICMA 2026లో TVS Apache RTR 125 LC బైక్ ఆవిష్కరణ.. 125cc ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
హైపర్ స్క్రీన్.. ప్రత్యేక ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కారులో 39.1 ఇంచుల MBUX హైపర్ స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది Mercedes-Benz ఆపరేటింగ్ సిస్టం (MB.OS) ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో స్మార్ట్ నావిగేషన్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఓవర్ ది ఎయిర్ (OTA) అప్డేట్స్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఇక బయటివైపు 942 పిక్సెల్స్‌తో కూడిన ఇల్యూమినేటెడ్ గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. క్యాబిన్లో SKY కంట్రోల్ పనోరమిక్ రూఫ్‌తో పాటు వెలుగులు విరజిమ్మే నక్షత్రాల డిజైన్‌ను అందించారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు రీసైకిల్ చేసిన పదార్థాలను కూడా ఉపయోగించారు.
రూ.200 కోట్ల పెట్టుబడి
భారత్‌లో తన తయారీ కార్యకలాపాలను మరింత పెంచేందుకు మెర్సిడెస్ బెంజ్ 2026లో అదనంగా రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీంతో భారత్‌లో కంపెనీ మొత్తం పెట్టుబడులు రూ.3,200 కోట్లకు చేరాయి. పుణెలోని చకన్ ప్లాంట్‌లో పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఒకే అసెంబ్లీ లైన్‌పై తయారు చేసే సౌకర్యం ఉంది. నాణ్యత పరిశీలన, సరఫరా వ్యవస్థ, ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు 15కి పైగా AI ప్రాజెక్టులను కూడా కంపెనీ అమలు చేస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు మెర్సిడెస్ మరో ప్రత్యేక సదుపాయాన్ని అందిస్తోంది. సాధారణంగా ఇచ్చే ఉచిత AC వాల్‌బాక్స్ ఛార్జర్‌కు ప్రత్యామ్నాయంగా MB.CHARGE పబ్లిక్ ఛార్జింగ్ క్రెడిట్స్‌ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంటి వద్ద ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాని వారికి ఈ విధానం ఉపయోగపడుతుంది.
బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..
ఈ ఎలక్ట్రిక్ SUV రిజిస్ట్రేషన్లపై ఆసక్తి వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిన తొలి 36 గంటల్లోనే 550 మందికి పైగా ఆసక్తి చూపినట్లు కంపెనీ వెల్లడించింది. ఇవి ప్రాథమిక ఆసక్తి వ్యక్తీకరణలు మాత్రమేనని, ఖరారైన బుకింగ్స్ కాదని గమనించాలి. భారత్‌లో 2016లో తొలిసారిగా విడుదలైన పెట్రోల్, డీజిల్ GLC మోడళ్లకు ఇప్పటివరకు దాదాపు 22 వేల మంది కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్ రాకతో ఈ SUV శ్రేణి మరింత విస్తరించింది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఓటింగ్‌కు దూరంగా వైసీపీ శ్రేణులు!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
JD Vance: వైట్ హౌస్‌లో అంతర్గత పోరు.. రిపబ్లికన్ పార్టీ ఓటమిపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ‘రన్ మెషిన్’.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
ట్రెండింగ్
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!