కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీరు మారుతి సుజుకి కస్టమర్లా? అయితే, ఇది మీకు చేదు వార్తే. దేశీయ కార్ల దిగ్గజం కంపెనీ మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని మోడల్ కార్ల ధరలను ఏప్రిల్ నుంచి పెంచేందుకు నిర్ణయించింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చులను భర్తీ చేయడానికి ఏప్రిల్‌లో తమ మోడల్ శ్రేణి ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకి ఇండియా గురువారం తెలిపింది. ఏప్రిల్ నుంచి ధరలను పెంచుకున్నట్లు ప్రకటించిన మారుతీ.. ఎంత శాతం పెంచేది స్పష్టత ఇవ్వలేదు.
Also Read:Swiss Open: భారత స్టార్ షట్లర్ల దూకుడు..ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు పివి సింధు, ప్రణయ్
ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన వ్యయ ఒత్తిడిని కంపెనీ కొనసాగిస్తోందని ఆటో తయారీదారు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు. మారుతి సుజుకి వ్యయాలను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వివిధ అంశాల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ధరల పెరుగుదలను అమలు చేయడం అవసరమని అంగీకరించింది. ఈ ధరల పెంపు సాధారణ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పాటు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే RDE నిబంధనల వంటి నియంత్రణ అవసరాలకు ప్రతిస్పందనగా ఉంది అని కంపెనీ మార్కెటింగ్ , సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. OEM వ్యయ నిర్మాణాలలో 75% వాటా కలిగిన మెటీరియల్‌ల ధరల పెరుగుదల కారణంగా మారుతి సుజుకి జనవరి 2021 నుండి ధరల పెంపును అమలు చేసింది.
Also Read:Nani Raviteja: ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్…
ఇదిలా ఉండగా, మారుతి సుజుకి తన పాపులర్ కాంపాక్ట్ SUV, Brezza యొక్క CNG వేరియంట్ కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆసక్తి ఉన్న కస్టమర్‌లు రూ.25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మూడు నుండి నాలుగు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో బ్రెజ్జా సిఎన్‌జిని మారుతి సుజుకి తొలిసారిగా ఆవిష్కరించింది.
కాగా, ఇప్పటికే హోండా కార్స్, టాటా మోటార్స్ మరియు హీరో మోటోకార్ప్‌తో సహా పలు వాహన తయారీదారులు ఏప్రిల్ నుండి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం తమ ఉత్పత్తులను రెండవ దశ BSVI ఉద్గార నిబంధనలకు అనుగుణంగా చేయడానికి కృషి చేస్తోంది.