Site icon NTV Telugu

Maruti Suzuki Sales 2025: మారుతీనా మజాకా!.. నిమిషానికి 4 కార్లు అమ్మింది గురూ..

Maruti Suzuki India

Maruti Suzuki India

Maruti Suzuki Sales 2025: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ అమ్మకాల్లో మరోసారి సంచలన సృష్టించింది. 2025 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయి ఉత్పత్తిని నమోదు చేసింది. మారుతి సుజుకి CY 2025లో 22.55 లక్షల యూనిట్లు విక్రయించి మరోసారి రికార్డు నెలకొల్పింది. అంటే నిమిషానికి 4 కార్లు అమ్మింది. ఈ ఏడాది వివరాలను వెల్లడిస్తూ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది గత సంవత్సరం (2024)తో పోలిస్తే 9.3 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ పేర్కొంది. వరుసగా రెండో ఏడాది కూడా 20 లక్షలకు పైగా వాహనాల ఉత్పత్తిని దాటడం గమనార్హం. కంపెనీ ప్రకారం.. ఈ ఉత్పత్తిలో దేశీయ విక్రయాలు, ఎగుమతులు, అలాగే OEM (ఇతర కంపెనీల కోసం తయారీ) సరఫరాలు కూడా ఉన్నాయి. 2024లో మారుతీ సుజుకి 20.63 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది.

READ MORE: Rajnath Singh: ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’పై రక్షణ మంత్రి ఆందోళన..

ఈ సందర్భంగా మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టకేఉచి మాట్లాడారు. ఉద్యోగుల కృషి, సరఫరాదారుల భాగస్వాములతో ఉన్న బలమైన సమన్వయమే ఈ రికార్డు ఉత్పత్తికి కారణమని తెలిపారు. అధిక స్థాయి లోకలైజేషన్‌ వల్లే ప్రపంచ స్థాయి నాణ్యతను కాపాడుతూ ఇంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఇది భారత ఆటోమొబైల్ తయారీ వ్యవస్థ బలాన్ని, అంతర్జాతీయ పోటీతత్వాన్ని చాటుతోందన్నారు. కాగా.. 2025లో మారుతీ సుజుకి అత్యధికంగా ఉత్పత్తి చేసిన టాప్ ఐదు మోడళ్లుగా ఫ్రాంక్స్ (Fronx), బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా నిలిచాయి.

READ MORE:Pooja Hegde: సక్సెస్ టేస్ట్ మర్చిపోయిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మను ఆదుకోవాల్సింది ఆ హీరోయేనా?

Exit mobile version