NTV Telugu Site icon

Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 2 లక్షలు తగ్గింది.. వివరాలు ఇవే..

Thunder Edition Jimny

Thunder Edition Jimny

Maruti Suzuki Jimny: ఇండియాలో ఆఫ్ రోడర్ వాహనాల్లో మహీంద్రా థార్ తన సత్తాను చాటుకుంది. అయితే థార్‌కి పోటీగా మారుతి సుజుకి జమ్నీతో మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది. థార్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేలా జిమ్నిని తీర్చిదిద్దింది. 5-డోర్ వాహనంగా జిమ్ని రావడం చాలా మందిని ఆకర్షింది. ఆఫ్-రోడర్‌గా, ఫ్యామిలీ కార్‌గా వినియోగించుకునేందు జిమ్ని మంచి ఆఫ్షన్‌గా మారింది. దీంతో పాటు సగటు ఇండియన్ కోరుకునే మైలేజ్ విషయంలో కూడా జమ్నిని మారుతి సుజుకీ తీర్చిదిద్దింది.

ఇదిలా ఉంటే జమ్నీ మరింత సరసమైన ధరకు వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. జమ్నీ కొత్త థండర్ ఎడిషన్ ధర, జిమ్నీ జీటా కంటే రూ. 2 లక్షలు తక్కువగా ఉంది. మారుతి సుజుకీ నెక్సా వెబ్సైట్ ప్రకారం.. జమ్నీ థండర్ ఎడిషన్ రూ. 10.74 లక్షలు(ఎక్స్-షోరూం)ధరకు అందుబాటులో ఉంది. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే ప్రారంభ ధరగా ఉండనుంది. అయితే జిమ్నీ థండర్ ఎడిషన్‌లో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని మారుతి సుజుకీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Read Also: Elon Musk: “నా చిన్నతనంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉండేది”.. మస్క్ కీలక వ్యాఖ్యలు..

జిమ్నీ థండర్ ఎడిషన్ K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. 105 పీఎస్ గరిష్ట శక్తి, 134 ఎన్ఎం గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్లలో లభిస్తుంది. జిమ్నీ లాడర్ ప్రేమ్ ఛాసిస్‌పై రూపొందించారు. ఆల్ గ్రిప్ 4వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంది.

జిమ్నీ జీటా, ఆల్ఫా వేరియంట్ల ధరలు(ఎక్స్ షోరూం)

జీటా MT – రూ. 12.74 లక్షలు
జీటా ఏటీ – రూ. 13.94 లక్షలు
ఆల్ఫా MT – రూ. 13.69 లక్షలు
ఆల్ఫా ఏటీ – రూ. 14.89 లక్షలు
ఆల్ఫా MT (డ్యూయల్ టోన్) – రూ. 13.85 లక్షలు
ఆల్ఫా AT (డ్యూయల్ టోన్) – రూ. 15.05 లక్షలు