NTV Telugu Site icon

Maruti Suzuki Jimny: మారుతి సుజుకీ జిమ్నిపై రూ.2.21 లక్షల వరకు తగ్గింపు.. వివరాలు ఇవే..

Maruti Suzuki Jimny

Maruti Suzuki Jimny

Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్ని.. ఇండియాలో ఆఫ్ రోడర్ వాహనాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. మహీంద్రా నుంచి ఆఫ్ రోడర్‌గా ఉన్న థార్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకీ జిమ్నిని మార్కెట్‌లోకి దించింది. థార్‌లో ఉన్న నెగిటివ్ పాయింట్ అయిన 5-డోర్ సమస్యను పరిష్కరిస్తూ.. జిమ్ని 5-డోర్‌తో వచ్చింది.

ఇదిలా ఉంటే, జిమ్ని మార్కెట్ లోకి లాంచ్ అయిన 7 నెలలకే రూ. 2.21 లక్షల వరకు భారీ తగ్గింపు అందిస్తోంది. మరింత మంది వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చే. ప్రస్తుతం జిమ్నిని మారుతి నెక్స్ నెట్వర్క్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, ఇన్విక్టో వంటి ప్రీమియం మోడళ్లను నెక్సా ద్వారా అందిస్తోంది.

అయితే, వినియోగదారుల నుంచి ఆలోచిస్తే జిమ్ని ధర చాలా ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు వినియోగదారులు బెట్టర్ రోడ్ ప్రెజెన్స్ కారణంగా మహీంద్రా థార్ వైపు మొగ్గు చూపుతున్నట్లు పలువురు డీటర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆఫ్ రోడర్ విభాగంలో ఫ్యామిలీ కార్‌గా కూడా వాడుకునే అవకాశం ఉండటం జిమ్నీకి కలిసి వస్తోంది.

Read Also: Congress Cabinet: తెలంగాణలో కొత్త మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నజర్..

జిమ్నీ లాంచ్ సమయంలో రెండు వేరియంట్లతో వచ్చింది. ధరలు ఈ విధంగా(ఎక్స్-షోరూం) ఉన్నాయి.
జీటా MT – రూ. 12.74 లక్షలు
జీటా ఏటీ – రూ. 13.94 లక్షలు
ఆల్ఫా MT – రూ. 13.69 లక్షలు
ఆల్ఫా ఏటీ – రూ. 14.89 లక్షలు
ఆల్ఫా MT (డ్యూయల్ టోన్) – రూ. 13.85 లక్షలు
ఆల్ఫా AT (డ్యూయల్ టోన్) – రూ. 15.05 లక్షలు

ఇదిలా ఉంటే ప్రస్తుతం జీటా వేరియంట్((MT మరియు AT) రూ. 2.21 లక్షల వరకు( రూ. 2.16 లక్షలు కన్జూమర్ ఆఫర్, రూ.5,000 కార్పొరేట్ బోనస్) వరకు తగ్గింపు కలిగి ఉండగా.. ఆల్ఫా వేరియంట్లో వినియోగదారులు రూ. 1.21 లక్షల వరకు (రూ. 1.16 లక్షల వినియోగదారు ఆఫర్ మరియు రూ. 5,000 కార్పొరేట్ బోనస్) తగ్గింపులను పొందవచ్చు.

ఇదిలా ఉంటే జిమ్నిని మరింత తక్కువ ధరలోకి తీసుకురావడానికి ప్రతీ వేరియంట్ పై థండర్ స్పెషల్ ఎడిషన్‌ని తీసుకువచ్చింది. థండర్ స్పెషల్ ఎడిషన్ ధరలు(ఎక్స్-షోరూం) ఈ విధంగా ఉన్నాయి.

Zeta MT థండర్ – రూ. 10.74 లక్షలు
జీటా ఏటీ థండర్ – రూ. 11.94 లక్షలు
ఆల్ఫా MT థండర్ – రూ. 12.69 లక్షలు
ఆల్ఫా ఏటీ థండర్ – రూ. 13.89 లక్షలు
ఆల్ఫా MT థండర్ (డ్యూయల్ టోన్) – రూ. 12.85 లక్షలు
ఆల్ఫా ఏటీ థండర్ (డ్యూయల్ టోన్) – రూ. 14.05 లక్షలు