మారుతి సుజుకి ఇండియా తన ఎస్‌యూవీ బ్రెజ్జా బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు కార్తీక్ ఆర్యన్‌ని ప్రకటించింది . 2016లో ప్రారంభించినప్పటి నుంచి మారుతి 12,00,000 యూనిట్లకు పైగా బ్రెజ్జాను విక్రయించింది. 2024 సంవత్సరంలో 1,88,160 యూనిట్ల విక్రయాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా పేరుగాంచింది. దీంతో బ్రెజ్జా యొక్క ప్రజాదరణను అంచనా వేయవచ్చు. మారుతి సుజుకి బ్రెజా టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, స్కోడా కైలక్ వంటి ఎస్‌యూవీలతో పోటీపడుతోంది.
READ MORE: Minister Nara Lokesh: ఏపీకి రండి.. ఇండస్ట్రియల్ పార్క్‌లు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టండి..
ఇటీవల సరికొత్త బ్రిజ్జాను కంపెనీ విడుదల చేసింది. స్పోర్టీ లుక్.. కట్టిపడేస్తోంది. ఇండియాలో ఇదిపాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలుస్తోంది. ఈ S-CNG ఎక్స్-షోరూమ్ ధర రూ.8,34,000గా ఉంది. దీని జామెట్రిక్ ఫెండర్స్ పవర్‌ఫుల్ లుక్ ఇస్తున్నాయి. అలాగే.. LED డీఆర్ఎల్స్‌తో డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్స్, LED టైల్ ల్యాంప్స్ దీనికి ఎనర్జిటిక్ డిజైన్ ఇస్తున్నాయి. ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్ అప్ డిస్‌ప్లే, సుజుకీ కనెక్ట్, స్మార్ట్ ప్లే ప్రో ప్లస్, వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్, 360 డిగ్రీ వ్యూ కెమెరా వంటి ప్రత్యేక ఫీచర్లు కలిగివుంది. డ్యూయల్ టోన్ కలర్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, జామెట్రిక్ అల్లాయ్ వీల్స్.. ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
READ MORE: Auto Expo 2025: యాక్టివాకు పోటీగా హీరో కొత్త స్కూటర్!.. వారికి బెటర్ ఆప్షన్..
ఈ కారుకు సీటింగ్ కెపాసిటీ 5 ఉంది. K15C ఇంజిన్ ఉంది. Petrol+ CNG (Bi-fuel) టైపు ఇంజిన్ ఇచ్చారు. 1462 cc కెపాసిటీ కలిగివుంది. ఇది 1.5L అడ్వాన్స్డ్ K సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT ఇంజిన్, దీనికి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఇంకా ప్రోగ్రెస్సివ్ స్మార్ట్ హైబ్రిట్ టెక్నాలజీ ఉంది. ఈ SUV మైలేజ్ చూస్తే.. కేజీ CNGతో 25.51 కిలోమీటర్లులు వెళ్లొచ్చు. దీని ఫ్యూయల్ ట్యాంకర్ 48 లీటర్ల స్పేస్ కలిగివుంది. అలాగే.. CNG 55 కేజీలు కలిగివుంది. ఈ కారు లోపల మోనో టోన్ థీమ్ ఇచ్చారు. క్యాబిన్ ల్యాంప్ ఉంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, లగేజ్ ఏరియాలో హుక్, IP ఓర్నమెంట్ ఇచ్చారు. సెంట్రల్ లాకింగ్ ఉంది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. డ్రైవర్, కో-డ్రైవర్‌కి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇన్ఫోగ్రాఫిక్ డిస్‌ప్లేతో రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉంది. హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ ల్యాంప్, యాంటీ-థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్, డ్యూయల్ హార్న్, డే/నైట్ రియర్ వ్యూ మిర్రస్ ఉంది. డోర్ అజార్ వార్నింగ్ ల్యాంప్ కూడా అమర్చారు.