Maruti Suzuki Upcoming Cars 2026: 2025 సంవత్సరంలో మారుతి సుజుకీ భారత్‌లో కేవలం ఒకే ఒక కొత్త కారును మాత్రమే విడుదల చేసింది. అది విక్టోరిస్ అనే మిడ్‌సైజ్ SUV. సాధారణంగా ఏటా 2 లేదా 3 కొత్త కార్లు విడుదల చేసే మారుతీకి ఈ ఏడాది కాస్త వెనుకబడింది. కానీ 2026లో మళ్లీ వేగం పెంచేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మారుతీ రెండు ఎలక్ట్రిక్ వాహనాలు, ఒక ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ విడుదల చేయడంతో పాటు బ్రెజ్జా SUVకి ఫేస్‌లిఫ్ట్‌ను కూడా తీసుకురానుంది.
READ MORE: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
మారుతి సుజుకీ భారత్‌లో తన తొలి ఎలక్ట్రిక్ కారుగా ఈ విటారాను 2026 జనవరిలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ కారు మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV, విన్‌ఫాస్ట్ VF6, టాటా కర్వ్ EV లకు పోటీగా నిలుస్తుంది. ఈ విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. ఒకటి 49kWh, మరొకటి 61kWh. ఇవి రెండూ ముందుభాగంలో ఉన్న ఎలక్ట్రిక్ మోటర్‌తో పనిచేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ SUV ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 543 కిలోమీటర్ల దూరం వెళ్లగలదని కంపెనీ చెబుతోంది. భద్రత విషయంలో కూడా ఈ కారుకు 5 స్టార్ భారత్ NCAP రేటింగ్ లభించింది.
తన తొలి EVతో పాటు మారుతి సుజుకీ 2026లో తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌ను కూడా విడుదల చేయనుంది. ఈ ఇంజిన్ ఫ్రాంక్స్ కాంపాక్ట్ SUVలో అందుబాటులోకి వస్తుంది. ఈ ఇంజిన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది E85 వరకు ఎథనాల్–పెట్రోల్ తో పనిచేయగలదు. అంటే 85 శాతం ఎథనాల్, 15 శాతం పెట్రోల్‌తోనూ ఈ కారు నడుస్తుంది. ఇంజిన్ తప్ప మిగతా విషయాల్లో ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ డిజైన్, ఫీచర్లు ప్రస్తుతం ఉన్న ఫ్రాంక్స్‌లాగే ఉంటాయని అంచనా.
మారుతీ నుంచి వచ్చే రెండో ఎలక్ట్రిక్ వాహనం ఒక MPV రూపంలో ఉంటుంది. దీనికి ‘YMC’ అనే కోడ్ నేమ్ ఉంది. ఇది ఈ విటారా ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుందని సమాచారం. ఇది మారుతీ తొలి పూర్తిగా ఎలక్ట్రిక్ MPV అవుతుంది. ఎర్టిగా, XL6 కంటే పై స్థాయిలో ఈ వాహనం ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇది కియా కారెన్స్ క్లావిస్ EVకి పోటీగా నిలవవచ్చు. ఈ YMC మోడల్‌లో కూడా 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండొచ్చు. ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 500 నుంచి 550 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వవచ్చని అంచనా.
READ MORE: Amarinder Singh: బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్.. కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తి లేదు..
అలాగే మారుతి సుజుకీ బ్రెజ్జా కాంపాక్ట్ SUVకి కూడా 2026లో ఫేస్‌లిఫ్ట్ తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న రెండో తరం బ్రెజ్జా నాలుగో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ అప్‌డేట్ రానుంది. టెస్టింగ్ సమయంలో కనిపించిన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కార్లను చూస్తే, డిజైన్‌లో చిన్న చిన్న మార్పులు ఉండేలా కనిపిస్తున్నాయి. విక్టోరిస్ మోడల్‌లో ఉన్నట్లే అండర్‌బాడీ CNG ట్యాంక్ సెటప్ కూడా ఉండే అవకాశం ఉంది. లోపల ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులు, మరికొన్ని కొత్త ఫీచర్లు జోడించే అవకాశం ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇప్పటిలాగే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (103 హెచ్‌పీ) కొనసాగుతుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో పాటు CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
