దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఆటో ఎక్స్‌పో 2025లో తన 7 కార్ల ప్రత్యేక ఎడిషన్‌లను ప్రదర్శించింది. ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఈ కార్లలో కొన్ని మార్పులు చేసింది. వీటిలో మారుతి సుజుకి డిజైర్ యొక్క అర్బన్ లక్స్ ఎడిషన్ కూడా ఉంది. డిజైర్ యొక్క కొత్త వేరియంట్‌లో ఫ్రంట్ గ్రిల్, డోర్ ప్యానెల్, వెనుక బంపర్ చుట్టూ క్రోమ్ ఎలిమెంట్స్ అమర్చారు. ప్రస్తుత డిజైర్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధరను ఒకసారి చూద్దాం.
READ MORE: Katchatheevu: “కచ్చతీవు”పై ఇందిరా గాంధీని ప్రశంసించిన కాంగ్రెస్.. అన్నామలై తీవ్ర విమర్శలు..
మారుతి డిజైర్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ ఉన్నాయి. కొత్త మారుతి డిజైర్ భారతీయ కస్టమర్లకు మొత్తం 7 రంగుల్లో లభిస్తుంది. కంపెనీ డిజైర్‌లో 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఇది గరిష్టంగా 81.58bhp శక్తిని, 111.7Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మారుతి డిజైర్ యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల వరకు ఉంది. ఈ కారు మార్కెట్లోని కొత్త డిజైర్ హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి సెడాన్‌లతో పోటీపడుతుంది.
ఇదిలా ఉండగా.. మారుతి కార్లు అంటేనే బిల్ట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతాయనే ఒక ఆపవాదు ఉంది. ఇటీవల విడుదలైన మారుతి సుజుకి స్విఫ్ట్ జపాన్ NCAP ద్వారా 4-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను అందుకుంది. అయితే, కొత్త డిజైన్ ఇటీవల గ్లోబల్ NCAP రేటింగ్‌లో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 5-స్టార్ రేటింగ్ అందుకుంది. అయితే, చైల్డ్ సేఫ్టీలో 4-స్టార్ రేటింగ్ పొందింది. 5-స్టార్ రేటింగ్ అందుకున్న తొలి మారుతి కారుగా డిజైర్ హిస్టరీ క్రియేట్ చేసింది.