NTV Telugu Site icon

Bharat Mobility Global Expo 2025: సుజూకీ నుంచి 3 కొత్త ద్విచక్ర వాహనాలు.. అద్దిరిపోయాయి!

Maruti Suzuki

Maruti Suzuki

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన 3 కొత్త ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. ఇందులో కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇ-యాక్సెస్ కూడా ఉంది. సుజుకీకి చెందిన ప్రముఖ స్కూటర్ యాక్సెస్ ను కంపెనీ నవీకరించి విడుదల చేసింది. కంపెనీ Gixxer SF 250ని కూడా విడుదల చేసింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం…

ఇ-యాక్సెస్
సుజుకి ఈ-యాక్సెస్ 3.07kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 95 కిలోమీటర్ల పరిధిని రేంజ్ అందిస్తుంది. స్కూటర్ గరిష్టంగా గంటకు 71 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని మీకు తెలియజేద్దాం. ఇ-యాక్సెస్‌లో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అమర్చారు. ఇది 4 గంటల 42 నిమిషాలలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అంతే కాకుండా ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి.. బ్యాటరీని కేవలం 2.2 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

కొత్త యాక్సెస్..
మరోవైపు, భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో కొత్త సుజుకి యాక్సెస్ 125 విడుదల చేశారు. ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.81,700. మునుపటి మోడల్‌తో పోలిస్తే కొత్త యాక్సెస్ 125లో చాలా మార్పులు చేశారు. కొత్త యాక్సెస్‌లో 125సీసీ , సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు.

Gixxer SF 250
సుజుకి తన మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్ Gixxer SF 250ని పరిచయం చేసింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.17 లక్షలుగా నిర్ధారించారు. Gixxer SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్ ఇప్పుడు 85 శాతం వరకు ఇథనాల్‌ను ఉపయోగించవచ్చు. Gixxer SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ గరిష్టంగా 27bhp శక్తిని, 23Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.