Maruti Suzuki Brezza CNG variants coming soon: అన్ని కార్ల కంపెనీలు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాయి. అయితే మారుతి సుజుకీ మాత్రం ఈవీల కన్నా సీఎన్‌జీ కార్ల ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. మారుతి సుజుకీ నుంచి అత్యంత విజయవంతం అయిన బ్రెజ్జాను త్వరలో సీఎన్‌జీ వేరియంట్ లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. గతంలో మారుతి సుజుకీ విటారా బ్రెజ్జాగా ఉన్న కారును ఇటీవల కొత్తగా పేరు మార్చి బ్రెజ్జాగా, గ్రాండ్ విటారాగా రెండు మోడళ్లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది.
ఇదిలా ఉంటే త్వరలోనే మారుతి సుజుజీ బ్రెజ్జా సీఎన్‌జీ మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బ్రెజ్జా సీఎన్‌జీ నుంచి ఎంటీ, ఏటీ ఆఫ్షన్లలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి సుజుకీ మొత్తం 10 సీఎన్‌జీ మోడళ్లను విక్రయిస్తోంది. బ్రెజ్జా సీఎన్‌జీ మార్కెట్ లోకి వస్తున్న తొలి ఫోర్ మీటర్ సబ్ కాంపాక్ట్ ఎస్ యూ వీ. ప్రస్తుతం దీని కాంపిటీటర్స్ అయిన టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV300 కార్లు ఏవీ కూడా సీఎన్‌జీ వేరియంట్లను అందించడం లేవు. ప్రస్తుత బ్రెజ్జా Lxi, Vxi, Zxi, Zxi+ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ నాలుగు వేరియంట్లు కూడా సీఎన్‌జీలో లభించనున్నాయి.
Read Also: Delhi: తుపాకీ గురి పెట్టి టయోటా ఫార్చ్యూనర్ కార్ దొంగతనం.. వైరల్ వీడియో..
ప్రస్తుతం మారుతి సుజుకీ నుంచి ఎర్టిగా కారు మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ కలిగి ఉన్న సీఎన్‌జీ కారుగా ఉంది. ఎర్టీగా పెట్రోల్ వెర్షన్ 99 హార్స్ పవర్ తో 136 న్యూటన్ మీటర్ టార్క్ పవర్ ను జనరేట్ చేస్తుంది. ఇదే సీఎన్‌జీ మోడ్ లో 87 బీహెచ్పీ, 121 న్యూటన్ మీటర్ టార్క్ పవర్ ను ఇస్తుంది. ఇలాంటి పవర్ నే బ్రెజ్జా సీఎన్‌జీలో మనం ఆశించవచ్చు. ప్రస్తుతం బ్రెజ్జా పెట్రోల్ వేరియంట్ ధర రూ. 7.99 నుంచి రూ. 13.96 (ఎక్స్ షోరూం)గా ఉంది. అయితే వీటితో పోలిస్తే సీఎన్‌జీ మోడల్ ధర మరో రూ. 95,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మారుతి నుంచి ఆల్టో, ఎస్ ప్రెస్సో, సెలారియో, వ్యాగన్ ఆర్, డిజైర్, ఎర్టీగా వంటివి సీఎన్‌జీలో లభిస్తున్నాయి.