Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3OO ఫేస్‌లిప్ట్ సరికొత్త పేరుతో మహీంద్రా XUV 3XOగా వస్తోంది. మరింత స్టైలిష్‌గా, మరిన్ని టెక్ లోడెడ్ ఫీచర్లతో ఈ నెల చివర్లో ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడేలా ఈ కార్‌ని మహీంద్రా రూపొందించింది. ముఖ్యంగా ఈ సెగ్మెంట్‌లో ఉన్న టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ వంటి కార్లకు మహీంద్రా XUV 3XO పోటీని ఇవ్వనునంది.
ఈ పోటీని తట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఈ కార్ రాబోతోంది. ఇప్పటికే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కారులో మరిన్ని ఫీచర్లను అందించనున్నారు. Adrenox Connect టెక్నాలజీతో రానుంది. ఈ Adrenox కనెక్ట్ యాప్‌తో మొబైల్ ద్వారా కారులోని ఉష్ణోగ్రతను రిమోట్‌గా సర్దుబాటు చేయగలరు. అయితే, ఇది ఎంపిక చేసిన వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. సమ్మర్‌లో ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
Read Also: Jairam Ramesh: ఇండియా కూటమి ప్రధాని ఎలాన్ మస్క్‌ని భారత్‌కి ఆహ్వానిస్తారు..
మహీంద్రా XUV 3XO, LED DRLలతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంపులను కలిగి ఉంటుంది. 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో పాటు క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డు సరికొత్తగా కనిపించనుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఉన్నాయి. డ్యూయల్-జోన్ ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్ సిస్టమ్, వెంటిలేడెట్ సీట్లు, కొత్త స్టీరింగ్‌ని కలిగి ఉంటుంది. అన్నింటి కన్నా ముఖ్యంగా సెగ్మెంట్‌లోనే తొలిసారిగా పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉండబోతోంది. అయితే, ఇందులో ADAS ఫీచర్లు ఉంటాయో లేదో చూడాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం లెవెల్-2 ADAS ఉండవచ్చని తెలుస్తోంది. పాత మోడల్‌లో ఉన్న ఇంజన్ ఆప్షన్లు కొత్త XUV 3XOలో ఉండనున్నాయి. దీని ధర రూ. 8.50 లక్షల నుంచి రూ. 16 లక్షలు(ఎక్స్-షోరూం) మధ్య ఉంటుందని అంచనా.