Mahindra Vision S: మహీంద్రా కంపెనీ ప్రస్తుతం పలు కొత్త మోడళ్ల అభివృద్ధిపై వర్క్ చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది త్వరలో రాబోతుంది. మహీంద్రా Vision S SUV మోడల్‌ను ఇప్పటి వరకు కాన్సెప్ట్ రూపంలోనే అధికారికంగా పరిచయం చేసినప్పటికీ, ఇప్పటికే రోడ్డుపై టెస్ట్ మ్యూల్‌గా పరీక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన స్పై చిత్రాలను పరిశీలిస్తే.. ఇది ప్రొడక్షన్ వెర్షన్‌కు మరింత దగ్గర అవుతోందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ SUV ద్వారా మహీంద్రా సబ్-4 మీటర్ విభాగంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. ప్రత్యేకంగా రగ్డ్ డిజైన్‌తో ఈ మోడల్ వినియోగదారులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
Read Also: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు బంగారం, గోల్డ్ ధరలు ఇలా..!
డిజైన్:
స్పై చిత్రాల ఆధారంగా చూస్తే, మహీంద్రా Vision S నేరుగా నిలిచిన స్టాన్స్, ఫ్లాట్ బాడీ ప్యానెల్స్, స్క్వేర్ ఆకృతులతో కనిపిస్తోంది. ఇవన్నీ సాధారణంగా ఆఫ్-రోడ్‌కు అనుకూలంగా ఉండే పెద్ద SUVలలో కనిపించే లక్షణాలు. అయితే, నగరాల్లోని కస్టమర్లకు సరిపోయేలా మొత్తం పరిమాణాన్ని కాంపాక్ట్‌గా ఉంచినట్లు తెలుస్తోంది. క్యామఫ్లాజ్ ఉన్నప్పటికీ, వాహనం రూపురేఖలు బలమైన లుక్‌తో పాటు ప్రాక్టికాలిటీని కలబోసినట్లుగా కనిపిస్తుంది.
ఫీచర్లు:
కొత్త ఫోటోలలో బయటపడిన ముఖ్యమైన అంశం డీజిల్ పవర్ట్రైన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఫ్యూయల్ ఫిల్లర్ పక్కన కనిపించిన AdBlue క్యాప్ ద్వారా ఇది BS6 ఫేజ్-2 ప్రమాణాలకు అనుగుణమైన డీజిల్ ఇంజిన్‌తో రానున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ టెస్ట్ యూనిట్లో ఆటోమేటిక్ గేర్ లీవర్ కనిపించడంతో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉండనుందని స్పష్టమైంది. సబ్-4 మీటర్ SUV విభాగంలో డీజిల్-ఆటోమేటిక్ కలయిక అరుదుగా ఉండటంతో, ఈ విషయంలో మహీంద్రాకు ప్రత్యేక ఆధిక్యం దక్కే ఛాన్స్ ఉంది.
Read Also: UK-China: 10 ఒప్పందాలపై యూకే-చైనా సంతకాలు.. దేనికి సంకేతాలు!
ఇంటీరియర్:
స్పై అయిన వాహనం మిడ్-లెవల్ వేరియంట్‌గా కనిపిస్తోంది. దీనికి కారణం హాలోజన్ టర్న్ ఇండికేటర్లు, ఫాబ్రిక్ సీట్స్, అలాగే సాధారణ మహీంద్రా స్టీరింగ్ వీల్ వాడటం. ఆగస్టులో మహీంద్రా విడుదల చేసిన Vision S కాన్సెప్ట్‌కు అనుగుణంగానే క్యాబిన్ డిజైన్ కొనసాగుతోంది. డాష్‌బోర్డ్ లేఅవుట్, ఎయిర్ వెంట్ డిజైన్, మొత్తం ఆర్కిటెక్చర్లో పెద్దగా మార్పులు లేవు.. ఇన్ఫోటైన్మెంట్, క్లైమేట్ కంట్రోల్‌కు ఫిజికల్ బటన్లు కొనసాగించడం ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. క్యాబిన్లో ప్రధాన ఆకర్షణగా పనోరమిక్ సన్‌రూఫ్ నిలవనుంది. ఇది వెనుక సీట్ల హెడ్రెస్టుల వరకు విస్తరించినట్లు కనిపిస్తోంది. వెనుక సీట్లకు మూడు అడ్జస్టబుల్ హెడ్‌రెస్టులు, 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ సదుపాయం ఉండటంతో స్పేస్ వినియోగం మరింత మెరుగవుతుంది.
పవర్ట్రైన్:
డీజిల్ ఆటోమేటిక్‌తో పాటు మహీంద్రా Vision Sలో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా XUV 3XOలో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, అలాగే థార్‌లో ఉన్న 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ఈ మోడల్లో అందించే అవకాశం ఉందని అంచనా.