Mahindra Udo: మహీంద్రా ఉడో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా.. తక్కువ ధరతో ఏకంగా 200 కి.మీ రేంజ్..
- మహీంద్రా ఉడో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా..
- తక్కువ ధరతో ఏకంగా 200 కి.మీ రేంజ్..
- విమానం ప్రేరణతో డిజైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Udo: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ తన త్రీ-వీలర్ ఆటోరిక్షా ‘‘ఉడో’’ను లాంచ్ చేసింది. రూ. 3,58,999 పరిచయ ధరతో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 3,84,299 కన్నా తక్కువ. విమనాం ప్రేరణతో ఈ ఆటోరిక్షాను డిజైన్ చేసినట్లు సంస్థ చెబుతోంది. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా ఫుల్ మోనోకోక్ నిర్మాణం దీని ప్రత్యేకత. ప్రతాప్ బోస్ దీనిని డిజైన్ చేశారు. బోల్డ్ హెడ్ ల్యాంప్స్, వెడల్పైన విండ్ షీల్డ్ ఉన్నాయి. డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు డ్రైవర్ల కోసం 20 శాతం మందంగా ఉండే ‘‘ఫైలట్ సీట్’’ ఇందులో ఉంది.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ప్రయాణికుల కోసం తగినంత హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ ఇచ్చారు. స్టైలిష్ సీటింగ్ అందించారు. ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్, డ్యుయల్-ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను ఇస్తున్నారు. దీని వల్ల గతుకల రోడ్లపై కూడా బెటర్ రైడ్ క్వాలిటీని అందిస్తుంది. రీజనరేటివ్ బ్రేకింగ్, సెగ్మెంట్‌లోనే తొలిసారిగా రివర్స్ థ్రోటిల్, హిల్ హోల్డ్, క్రీప్ మోడ్ వంటివి అందించారు.
11.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన ఉడో 10 kW పీక్ పవర్, 52 Nm టార్క్ అందిస్తుంది. ఒక్క ఛార్జ్‌తో 265 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతుంది, రియల్‌గా 200 కి.మీ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది రేంజ్, రైడ్, రేస్ మోడ్‌లను కలిగి ఉంటుంది. రేస్ మోడ్‌లో గంటలకు 55 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!