మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV కోసం కొత్త బాస్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. అనేక కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లతో వస్తుంది. డీలర్‌షిప్ స్థాయిలో యాక్సెసరీస్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తున్నారు. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ పండుగ సీజన్‌లో మాత్రమే అమ్మకానికి ఉంటుందని తెలుస్తోంది. ఈ లోపే త్వరపడితే బెస్ట్ డీల్ లభించవచ్చు.. స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం….
Read Also: Chutneys : కొండాపూర్ ‘చట్నీస్’లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.. కుళ్లిన కూరగాయలు లభ్యం
ఇంజన్ పవర్, గేర్‌బాక్స్:
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్‌తో అందిస్తున్నారు. ఈ ఇంజన్ 3,750 rpm వద్ద 130 bhp గరిష్ట శక్తిని.. 1,600-2,800 rpm వద్ద 300 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 4×4 డ్రైవ్‌ట్రెయిన్ ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ ఎస్‌యూవీ హెడ్‌ల్యాంప్‌పై డార్క్ క్రోమ్ గార్నిష్ ఇచ్చారు. ఫ్రంట్ బంపర్, రెయిన్ వైజర్, ORVMల కోసం కార్బన్ ఫైబర్ కవర్‌లపై యాడ్-ఆన్‌లు కూడా ఇన్‌స్టాల్ చేశారు. ఈ SUVకి బ్లాక్ పౌడర్ కోటింగ్‌తో రేర్ గార్డ్ కూడా అమర్చారు.
కలర్ ఆప్షన్లు:
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఐదు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అందులో గెలాక్సీ గ్రే, డైమండ్ వైట్, స్టెల్త్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్ వంటి రంగులు ఉన్నాయి.
ఇంటీరియర్:
ఈ SUV వెనుక పార్కింగ్ కెమెరా ఉంది. ఇది టైట్ పార్కింగ్ ప్రదేశాలలో వాహనాన్ని నడిపించడంలో సహాయపడుతుంది. అప్హోలిస్టరీని నలుపు రంగులోకి మార్చారు. దానితో పాటు పిల్లో, కుషన్లను కలిగి ఉన్న మహీంద్రా కంఫర్ట్ కిట్ సైతం వస్తుంది.
వేరియంట్లు, ధర:
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. S, S11. వీటి ధర రూ.13.62 లక్షల నుంచి మొదలై రూ.17.42 లక్షల వరకు ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.