Site icon NTV Telugu

Mahindra BE 6 Batman Edition: మరీ అంత క్రేజ్ ఏంటయ్యా బాబు.. 135 సెకన్స్ లో 999 కార్ల అమ్మకాలు!

Mahindra Be 6 Batman Edition

Mahindra Be 6 Batman Edition

Mahindra BE 6 Batman Edition: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మహీంద్రా మరోసారి సెన్సేషన్ సృష్టించింది. ఆగస్టు 14న ప్రత్యేకంగా విడుదల చేసిన Mahindra BE 6 Batman Edition కేవలం 135 సెకన్లలోనే మొత్తం 999 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొదట 300 యూనిట్లను మాత్రమే విడుదల చేసినప్పటికీ, వినియోగదారుల భారీ డిమాండ్ కారణంగా మహీంద్రా సంఖ్యను 999కి పెంచింది. కానీ, బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే అన్నీ సేల్ అవుట్ అయ్యాయి. దీనితో ఈ వాహనానికి ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా కనిపిస్తోంది.

కేవలం రూ.5,999లకే ఇన్ని ఫీచర్స్ ఏంటయ్యా..? కొత్త Itel Zeno 20 లాంచ్!

ఈ ప్రత్యేక ఎడిషన్ Pack Three వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో 79 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడింది. దీనితో ఒక్క చార్జ్‌తో 682 కి.మీ. ARAI సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది. రియర్ యాక్సిల్‌పై అమర్చిన ఈ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 286 hp పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ధర విషయానికి వస్తే ఈ స్పెషల్ ఎడిషన్‌ను మహీంద్రా రూ.27.79 లక్షలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజైన్ పరంగా ఈ ఎడిషన్ పూర్తిగా బ్యాట్‌మాన్ థీమ్‌లో ఆకట్టుకునేలా రూపొందించబడింది. సాటిన్ బ్లాక్ ఫినిష్, కస్టమ్ బ్యాట్‌మాన్ డీకల్స్, టైల్గేట్‌పై డార్క్ నైట్ ఎంబ్లమ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఫెండర్, బంపర్, రివర్స్ ల్యాంప్ వద్ద కూడా బ్యాట్‌మాన్ లోగో కనిపిస్తుంది.

డ్యుయల్ ఛానల్ ABS, కొత్త డిజైన్, కలర్తో వచ్చేసిన Royal Enfield Guerrilla 450.. ధరలు, ఫీచర్ల వివరాలు ఇలా

ఇక 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తున్న ఈ వేరియంట్‌లో 20-అంగుళాల వీల్స్ ఆప్షన్ కూడా ఉంది. వీల్ హబ్ క్యాప్స్, బ్రేకులు, స్ప్రింగ్స్‌పై Alchemy Gold ఫినిష్ కారుకు మరింత ప్రత్యేకతను అందిస్తుంది. ఇంటీరియర్ కూడా పూర్తిగా గోతమ్ థీమ్‌ లోనే తీర్చిదిద్దబడింది. ఇన్ఫినిటీ రూఫ్‌పై డార్క్ నైట్ ట్రైలజీ ఎంబ్లమ్, బ్యాట్ మ్యాన్ ప్రొజెక్షన్ ఉన్న నైట్ ట్రైల్ కార్పెట్ ప్లాంక్స్, డాష్‌బోర్డ్‌పై బ్రష్డ్ ఆల్కమీ ప్లాక్ ఈ ఎడిషన్ ప్రత్యేకతను పెంచుతున్నాయి. డ్రైవర్ ఏరియాలోని ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ చార్కోల్ లెదర్‌తో, గోల్డెన్ హాలో ఫినిష్‌తో అందించబడింది. స్వేడ్, లెదర్ సీట్లు గోల్డెన్ హైలైట్స్‌తో, డార్క్ నైట్ ట్రైలజీ బ్యాడ్జ్‌తో అద్భుతంగా మెరిసిపోతాయి. స్టీరింగ్ వీల్, కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీ ఫాబ్ అన్నింటిపైన కూడా బ్యాట్‌మాన్ లోగోను పొందుపరిచారు.

Exit mobile version