NTV Telugu Site icon

Tata Tiago NRG: సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్నారా.. అయితే, వచ్చేస్తోంది సరికొత్త టియాగో NRG

2025 Tata Tiago Nrg

2025 Tata Tiago Nrg

Tata Tiago NRG: సేఫ్టీ కార్‌ల విషయంలో టాటాకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. టాటా నుంచి వచ్చే కార్లు దాదాపుగా గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్స్‌లో 5-స్టార్ సేఫ్టీని సాధిస్తుంటాయి. టాటా హ్యాక్ బ్యాక్ కార్లు కూడా అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటాయి. సేఫ్టీ హ్యాచ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు టాటా గుడ్ న్యూస్ చెప్పింది. టాటా టియాగో NRG-2025 మార్కెట్‌లోకి రాబోతోంది. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు SUV లాంటి స్టైలింగ్ లక్షణాలతో హ్యాచ్‌బ్యాక్ పొందాలనుకునే కస్టమర్ల కోసం టాటా టియాగో NRGని రూపొందించింది. అయితే, ఇప్పుడు ఈ కార్ మరింత అప్‌డేట్స్‌తో వస్తోంది.

టాటా టియాగో NRG: ఇంజిన్ అండ్ పవర్‌ట్రెయిన్ వివరాలు

టాటా టియాగో NRG 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దీంట్లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్(AMT) రెండూ ఉండొచ్చు. ఇంజన్ 82 HP మాగ్జిమమ్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు కావాలంటే మాన్యువల్ లేదా AMT ఛాయిస్‌లతో CNG వేరియంట్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇది 73 HP గరిష్ట శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా టియాగో NRG: ఎక్స్‌టీరియర్ వివరాలు

2025 మోడల్ టియాగో NRG ఫ్రంట్, వెనక బంపర్‌లను రీడిజైన్ చేయబడిని సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, LED హెడ్‌లైట్లు, రీ డిజైన్డ్ వీల్ కవర్స్ కలిగి ఉంటుంది. టెయిల్ గేట్ వద్ద NRG బ్యాడ్జ్, చంకీ బ్లాక్ రూఫ్ రెయిల్స్, రెండు వైపులా ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ వంటి ఎక్స్‌టీరియర్స్ కలిగి ఉంది.

మరింత స్టైలిష్‌గా ఇంటీరియర్

టాటా టియాగో NRGలో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే , ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ సపోర్ట్ కలిగిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంటుంది. ఆటో హెడ్‌లైట్లు, వైపర్‌లు, రెయిర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత విషయాని వస్తే ముందు భాగంలో రెండు ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 3-పాయింట్ ELR సీట్ బెల్టులు, ఐసో ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, కారు వెనక భాగంలో పార్కింగ్ సెన్సార్లు, మాన్యువల్ HVAC ఉంటాయి.

ధర రూ. 7.2 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఇది భారత మార్కెట్‌లో హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.