NTV Telugu Site icon

Lamborghini: 56 దేశాల్లో 10వేలకుపైగా లగ్జరీ కార్ల డెలివరీ.. చరిత్ర సృష్టించిన కంపెనీ!

Lamborghini

Lamborghini

లంబోర్ఘిని తన చరిత్రలో ఘన విజయాన్ని సాధించింది. 2024లో కంపెనీ మొత్తం 10,687 వాహనాలను డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థకు ఇది చారిత్రాత్మక విజయం. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (EMEA) ప్రాంతంలోని దేశాలకు 4,227 కార్లను కంపెనీ పంపిణీ చేసింది. గతంతో పోలిస్తే ఎగుమతుల్లో 6% పెరిగింది. అమెరికాలో 3,712 కార్లు అమ్ముడయ్యాయి. ఇక్కడ కంపెనీ 7% వృద్ధి సాధించింది. మిగిలినవి పలు దేశాల్లో విక్రయించింది.

READ MORE:Mahesh Babu : మార్ష‌ల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?

56 దేశాలలో నెట్‌వర్క్, 186 డీలర్‌షిప్‌లు..
లంబోర్ఘిని ప్రస్తుతం 56 అంతర్జాతీయ మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 186 డీలర్‌షిప్‌ల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. కంపెనీ గత 18 నెలల్లో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేసింది. ఈ మోడళ్లు పూర్తిగా హైబ్రిడ్ వర్షన్‌లో ఉన్నాయి. కగా..2023లో లంబోర్ఘిని Revueltoని పరిచయం చేసింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. ఈ కారును భారీగా ఆర్డర్ చేసుకున్నారు. దీని ఆర్డర్‌లు 2026 చివరి నాటికి పూర్తవుతాయి.

READ MORE: Mahesh Babu : మార్ష‌ల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?

ఇదిలా ఉండగా.. లంబోర్ఘి సంస్థ 2023లో 10 వేల కార్లను విక్రయించింది. తన చరిత్రలో మొదటి 10వేల 112 యూనిట్లను 2023లో విక్రయించింది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా(EMEA) ప్రాంతం నుంచి అత్యధికంగా 3వేల 987 కార్లు అమ్ముడుపోగా అమెరికాలో 3వేల 465 యూనిట్లు , ఆసియా పసిఫిక్(APAC) ప్రాంతాల్లో 2వేల 660 కార్లను సేల్ చేసింది లంబోర్ఘి సంస్థ. EMEA ప్రాంతంలో 2023 అమ్మకాల్లో 14 శాతం వృద్ధి సాధించగా.. అమెరికాలో 9 శాతం, APAC ప్రాంతంలో 4 శాతం పెరిగింది. అమెరికాలో 3వేల కార్లు డెలివరీ చేసిన అతిపెద్ద మార్కెట్ గా ఉంది.

Show comments