గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTM 1390 Super Duke GT Evo: KTM నుండి మరో సరికొత్త ప్రీమియం బైక్ లాంచ్ కానుంది. EICMA 2026 వేదికగా కొత్త 1390 Super Duke GT Evo మోడల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 1390 Super Duke GT కంటే అధునాతన ఫీచర్లతో ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్, హైస్పీడ్ స్పోర్ట్స్ టూరింగ్‌ను దృష్టిలో పెట్టుకుని దీనిని తయారు చేసింది. 2027 ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లలో దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కాకపోతే ఈ బైక్ ను భారత్‌లో విడుదల చేస్తారా లేదా అనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
ఈ బైక్‌లో ఆకర్షణీయమైన ఫీచర్ అడ్వాన్స్డ్ AMT ట్రాన్స్మిషన్. ఇందులో పూర్తిగా ఆటోమేటిక్ లేదా మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ ఆప్షన్లు అందించారు. ఆటోమేటిక్ మోడ్‌లో రైడర్ గేర్లు మార్చాల్సిన అవసరం ఉండదు. దీంతో సుదూర ప్రయాణాల్లో అలసట తగ్గుతుంది. మాన్యువల్ మోడ్‌లో మాత్రం రైడర్లు తమకు నచ్చిన విధంగా గేర్లను మార్చుకోవచ్చు. ఇందులో 1,350cc, 75 డిగ్రీల V-ట్విన్ LC8 ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 187hp పవర్, 145Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read
- Russia vs Ukraine: 4.5 లక్షల మరణాలు..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణమైన పోరాటం!
- Tesla Cybertruck: "మూడేళ్లకే కథ ముగిసింది".. టెస్లా 'సైబర్ ట్రక్' ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
- స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
- క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
సుదూర ప్రయాణాల్లో రైడర్లకు మెరుగైన సౌకర్యం అందించేందుకు హ్యాండిల్బార్లను ముందుకు, వెనక్కి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. విండ్‌షీల్డ్‌ను కూడా అవసరానికి అనుగుణంగా ఎత్తు, తక్కువ స్థానాల్లో మార్చుకోవచ్చు. ఈ బైక్ సీట్ హైట్ 834mmగా ఉండగా.. బరువు 213 కిలోలుగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 149mmగా అందించారు. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే.. లేటెస్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ WP సెమీ యాక్టివ్ టెక్నాలజీ (SAT) సస్పెన్షన్‌ను ఉపయోగించారు. డ్యాష్‌బోర్డ్ ద్వారా సస్పెన్షన్ సెట్టింగ్స్‌ను సులభంగా మార్చుకోవచ్చు. కొత్త థ్రూ-రాడ్ నిర్మాణం కారణంగా గత వెర్షన్ల కంటే తక్కువ బరువుతో పాటు మెరుగైన పనితీరును అందిస్తుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఫ్రేమ్ స్టిఫ్నెస్ను మూడు రెట్లు పెంచినట్లు కంపెనీ తెలిపింది.
ఈ బైక్‌లో ముందు, వెనుక రెండు వైపులా 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. ఇంకా ఇందులో 8.8 ఇంచుల TFT డిస్ప్లే ఉంటుంది. ఇందులో ఆఫ్‌లైన్ మ్యాప్ నావిగేషన్, USB టైపు-C ఛార్జింగ్ పోర్ట్ అందించారు. కొత్త LED హెడ్‌లైట్ సెటప్ మెరుగైన వెలుతురును అందించడంతో పాటు 90 డిగ్రీల వరకు విజిబిలిటీని కల్పిస్తుంది. ఇంకా రైడింగ్ కోసం రైన్, స్ట్రీట్, స్పోర్ట్, కస్టమ్ మోడ్స్ ఉన్నాయి. అలాగే ఆప్షనల్ “ట్రాక్ మోడ్” కూడా అందుబాటులో ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్, కార్నరింగ్ ABS, సూపర్మోటో ABS, సూపర్మోటో+ ABS, స్పోర్ట్ ABS వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మొత్తంగా శక్తివంతమైన ఇంజిన్, AMT గేర్‌బాక్స్, ప్రీమియం టూరింగ్ ఫీచర్లతో ఈ కొత్త బైక్‌ను KTM రాబోతుంది.
తాజావార్తలు
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
NZ vs IND 3rd ODI: హామిల్టన్‌లో వరుణుడి ఆట.. భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు!
-
Suresh Raina on Retirement: నన్ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పలేదు.. కోహ్లీ, కోచ్‌పై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు..!
-
JC Prabhakar Reddy: అనంతపురం అభివృద్ధికి మేయర్ పార్టీ మారాలి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
-
Kaleshwaram Temple: భక్తులకు ముఖ్య గమనిక.. లక్షపత్రి పూజలు రద్దు, డిసెంబర్ 8 వరకు ప్రత్యేక పూజలు!
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!