NTV Telugu Site icon

Kinetic Zulu EV Scooter: మార్కెట్‌లోకి కొత్త ఈవీ స్కూటర్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

Kinetic Zulu E Scooter

Kinetic Zulu E Scooter

ప్రపంచవ్యాప్తంగా ఈవీ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీ స్కూటర్లను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ స్కూటర్లను ప్రోత్సహిస్తున్నాయి.. ఇటీవల కొత్త కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో ఈవీ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.. తాజాగా కైనెటిక్ గ్రీన్ జూలూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని భారతీయ మార్కెట్లో రూ. 94,990 రిలీజ్‌ చేసింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఈ స్కూటర్ ఫీచర్స్, కాస్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఈవీ తయారీదారు జులు ఈ-స్కూటర్ భారతదేశంలో తయారు చేస్తుంది. ఈ స్కూటర్‌ లివరీలు 2024 ప్రారంభంలో ప్రారంభమవుతాయి… ఈ ఫీచర్లను ఒకసారి చూస్తే.. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్రాన్-మౌంటెడ్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ డిజిటల్ స్పీడోమీటర్, ఆటో-కట్ ఛార్జర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి అధునాత ఫీచర్లతో వస్తుంది. ఇ-స్కూటర్ 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. కైనెటిక్ గ్రీన్ జూలు ఈ-స్కూటర్ 1,830 మిమీ పొడవు, 1,135 మిమీ ఎత్తు, 715 మిమీ వెడల్పు కలిగి ఉంటుంది.. అంతేకాదు ఈ స్కూటర్ 156 కిలోల పేలోడ్ సామర్థ్యంను కలిగి ఉంటాయి..

ఈ స్కూటర్ కు ఒక్కసారి చార్జ్ చేస్తే 104 కిమీ వస్తుంది.. 2.1 కేడబ్ల్యూ బీఎల్‌డీసీ ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చారు. కైనటిక్‌ జులు ఈవీ స్కూటర్‌ గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. 15 ఏఎంపీ సాకెట్‌ను ఉపయోగించి బ్యాటరీని కేవలం అరగంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.. బ్రేకింగ్ విధులు ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటుగా వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి.. ఇవే ఈ స్కూటర్ ముఖ్యమైన ప్రత్యేకతలు.. ఈ స్కూటర్ సేల్స్ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది.. ధర ఇంకా తెలియలేదు.. వచ్చే ఏడాదిలో ఈ స్కూటర్ కు పోటీగా ప్రముఖ కంపెనీలు కూడా ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నారు..