Site icon NTV Telugu

కియా Syros vs మహీంద్రా XUV 3XO- SUV కొనేవారికి ఏది బెస్ట్?

Mahendra

Mahendra

భారత్‌లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ రోజురోజుకూ దూసుకెళ్తుంది. ఈ విభాగంలో కియా సైరోస్, మహీంద్రా XUV 3XO మధ్య ప్రధానంగా పోటీ కొనసాగుతుంది. రెండూ కూడా 4 మీటర్ల లోపు పొడవు, ఆధునిక ఫీచర్లు, మంచి సేఫ్టీ, ఆకర్షణీయమైన SUV లుక్‌తో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక, ఫస్ట్ SUV కారును కొనాలని చూస్తున్న కస్టమర్లకు ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలన్నది పెద్ద కన్ఫ్యూజన్‌ గా మారింది. మరి.. ఈ రెండు కార్ల మధ్య తేడాలేంటో ఇప్పుడు చూద్దాం..

Read Also: Pavel Durov: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు హామీ.. మీ DNA నిరూపించుకోండి.. బిలియన్ల రూపాయల సంపదను పొందండి!

రెండు కార్ల ధరల మధ్య వ్యత్యాసం..?
కియా సైరోస్ ధర రూ. 8.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కాస్త ప్రీమియం ఫీల్‌ కోరుకునే వారికి ఇది నచ్చే రేంజ్‌ అని చెప్పాలి. ఇక, మహీంద్రా XUV 3XO మాత్రం రూ. 7,28,300 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. బడ్జెట్‌ ఫస్ట్ SUV కొనేవారికి ఇది మరింత అందుబాటులో ఉండే ఆప్షన్‌.

Read Also: Two Women’s Married:మగాళ్లంటే ఆసక్తి లేదు.. పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

ఇంజిన్‌ & పనితీరు..
Kia Syros
* 1.0 లీటర్ టర్బో పెట్రోల్- 118 bhp
* 1.5 లీటర్ డీజిల్- 114 bhp
* 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్
* సిటీ ట్రాఫిక్‌లో చాలా స్మూత్, రిఫైన్డ్ డ్రైవింగ్ అనుభూతి

Mahindra XUV 3XO
* పెట్రోల్ ఇంజిన్లు 111 bhp నుంచి 131 bhp వరకు
* 1.5 లీటర్ డీజిల్- 300 Nm టార్క్ (హైవేలో అదిరిపోయే పిక్-అప్)
* మాన్యువల్, ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లు
* ఓవర్‌టేక్‌లు, హైవే స్పీడ్‌లో మహీంద్రా మరింత దూకుడు చూపిస్తుంది
* సిటీ రిఫైన్‌మెంట్‌ కావాలంటే- Kia
* హైవే పవర్‌ కావాలంటే- Mahindra

రెండు కార్లలో తక్కువ ఖర్చులో మైలేజ్
Kia Syros
* పెట్రోల్- 18.2 kmpl వరకు
* డీజిల్- 20.75 kmpl వరకు

Mahindra XUV 3XO
* పెట్రోల్- 20.1 kmpl
* డీజిల్- 21.2 kmpl రన్నింగ్ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి XUV 3XO కాస్త ఎక్కువ మైలేజ్‌ ఇస్తుంది.

ఫ్యామిలీకి ఏది బెస్ట్?
Kia Syros
* 465 లీటర్ల భారీ బూట్‌ స్పేస్
* స్లైడింగ్‌ రియర్ సీట్లు (లగేజీ, లెగ్‌రూమ్‌ అవసరాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు)
* ఫ్యామిలీ ట్రిప్స్‌కి చాలా బెస్ట్

Mahindra XUV 3XO
* 364 లీటర్ల బూట్‌
* సెగ్మెంట్‌లోనే అత్యధిక వీల్‌బేస్ ఉండటం వల్ల వెనక లెగ్‌రూమ్‌ ఎక్కువ
* వెనక సీట్లో కూర్చునే వారికి మరింత కంఫర్ట్

అయితే, లగేజీ స్పేస్‌ ముఖ్యం అనుకుంటే కియా Syrosను ఎంపిక చేసుకోవచ్చు.. క్యాబిన్ లెగ్‌రూమ్ ముఖ్యం అనుకుంటే- మహీంద్రా XUV 3XO సెలక్ట్ చేసుకోవచ్చు.

ఫీచర్లు & టెక్నాలజీ?
Kia Syros ప్రత్యేకతలు
* పెద్ద డ్యూయల్ స్క్రీన్‌ డిస్‌ప్లే
* పనోరమిక్ సన్‌రూఫ్
* వెంటిలేటెడ్‌ సీట్లు, అంబియంట్ లైటింగ్
* లెవల్ 2 ADAS (బ్రేకింగ్, లేన్ కంట్రోల్‌కు స్మార్ట్ సపోర్ట్)

Mahindra XUV 3XO
* డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్లు
* 360-డిగ్రీ కెమెరా
* ప్రీమియం ఆడియో
* టాప్ వేరియంట్లలో లెవల్ 2 ADAS.. కాగా, కియా ప్రీమియం & ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇస్తే, మహీంద్రా మనీకి తగ్గ ఫీచర్లతో ఎక్కువ వాల్యూ అందిస్తుంది.

సేఫ్టీలో రెండూ స్ట్రాంగ్
* రెండు SUVs కూడా 5-స్టార్ భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ సాధించాయి. అలాగే, 6 ఎయిర్‌బ్యాగ్స్‌ స్టాండర్డ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, అడ్వాన్స్‌డ్ బ్రేకింగ్ సిస్టమ్స్‌ వంటి ఫీచర్లతో సేఫ్టీలో రెండూ సమానంగా బలంగా ఉన్నాయి.

ఫైనల్ గా ఏది కొనాలి?
ప్రీమియం ఫీల్‌, సిటీ రిఫైన్‌మెంట్‌, భారీ బూట్‌, టాప్ టెక్ కావాలంటే → Kia Syros
పవర్‌, మైలేజ్‌, 360 కెమెరా, వాల్యూ ఫర్ మనీ కావాలంటే → Mahindra XUV 3XO

Exit mobile version