Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kia Sorento: భారత ఆటోమొబైల్ మార్కెట్లో టొయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయ నాయకుల కాన్వాయ్‌ల నుంచి సామాన్య కార్ ప్రియుల వరకు ఈ ఎస్‌యూవీకి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సరైన పోటీ లేకపోవడం, టొయోటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకమే ఫార్చ్యూనర్ తిరుగులేని ఆధిపత్యానికి ప్రధాన కారణమయ్యాయి. ప్రస్తుతం ఎంజీ మేజెస్టర్ మాత్రమే దీనికి ఏకైక ప్రత్యర్థిగా ఉంది. అయితే, చాన్నాళ్లుగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కియా (Kia) సంస్థ సిద్ధమైంది. తన ప్రతిష్టాత్మక బిగ్ ఎస్యూవీ ‘సొరెంటో’ (Kia Sorento)ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.
మూడు వరుసల సీటింగ్ (3-Row SUV) సామర్థ్యంతో వస్తున్న కియా సొరెంటోను సెప్టెంబర్ 4న లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఫార్చ్యూనర్‌కు ఇది ప్రధాన పోటీదారుగా మారడానికి దీని ధర పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. నివేదికల ప్రకారం, సొరెంటో ప్రారంభ ధర సుమారు రూ. 28 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కియా ఇదే ధరతో మార్కెట్లోకి వస్తే ఫార్చ్యూనర్ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించడం ఖాయంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఫార్చ్యూనర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 34.76 లక్షలుగా ఉంది. రూ.30 లక్షల కంటే తక్కువ బడ్జెట్లో 7 సీటర్ ఎస్యూవీ లభిస్తే కస్టమర్లు సొరెంటో వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. సాంకేతిక పరంగా ఈ రెండు కార్ల మధ్య పెద్ద వ్యత్యాసమే ఉంది. ఫార్చ్యూనర్ పాత తరం బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణంపై ఆధారపడి, రఫ్ అండ్ టఫ్ రోడ్లకు అనువుగా డిజైన్ చేయబడింది. కానీ, సొరెంటోను మోనోకాక్ (Monocoque) నిర్మాణంలో తీసుకొస్తున్నారు. ఇది అత్యాధునిక క్యాబిన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మైలేజ్, నిత్యం నగరాల్లో నడిపేందుకు అనుకూలంగా ఉంటుంది.
Also Read
- BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
- TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
ఇంజన్ విషయానికొస్తే, సొరెంటో రెండు వేరియంట్లలో రానుంది. మొదటిది స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్. సిటీ డ్రైవింగ్‌కు ఇది అద్భుతమైన ఎంపిక. డీజిల్ కార్లకు దూరంగా ఉండాలనుకునే పట్టణ వినియోగదారులకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు. రెండవది డీజిల్ ఇంజన్. లాంగ్ డ్రైవ్‌లు, ఎక్కువ టార్క్ కోరుకునే వారి కోసం ఇది అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, సొరెంటో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఫీచర్‌తో రానుంది. అధునాతన ఫీచర్లు, తక్కువ ధర, స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న కియా సొరెంటో.. భారత మార్కెట్లో టొయోటా ఫార్చ్యూనర్ సామ్రాజ్యానికి ఎంతవరకు గండి కొడుతుందో చూడాలి!
తాజావార్తలు
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!