Site icon NTV Telugu

Kia Car Offers: ఇదేం మాస్ ఆఫర్ రా మామ.. ఏకంగా 3.65 లక్షల వరకు KIA India భారీ డిస్కౌంట్!

Kia

Kia

Kia Car Offers: మరి కొన్ని రోజుల్లోనే 2025 సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో కియా ఇండియా వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా ఆఫర్ ప్రకటించింది. కార్ కొనుగోలును మార్చేందుకు ‘ఇన్‌స్పైరింగ్ డిసెంబర్’ పేరిట ప్రత్యేక ఏడాది చివరి సేల్స్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. డిసెంబర్ 2025 అంతటా అమల్లో ఉండే ఈ ఆఫర్.. ఎంపిక చేసిన కియా మోడళ్లపై గరిష్ఠంగా రూ.3.65 లక్షల వరకు డిస్కౌంట్ లభించనుంది. కియా సెల్టోస్, సోనెట్ లాంటి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలు, ఐసీఈ, ఈవీ వేరియంట్లలో లభించే కియా కారెన్స్ క్లావిస్, తాజాగా విడుదలైన సైరోస్, లగ్జరీ ఎంఫీవీ కియా కార్నివాల్ వంటి మోడళ్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

Read Also: Scrub Typhus: తిరుపతిలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్..

అయితే, వినియోగదారులు తమ సమీప డీలర్‌షిప్‌ను సందర్శించడమే కాకుండా, కియా ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా మైకియా మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనసులు, ఇప్పటికే కియా వెహికిల్స్ ఉన్నవారికి లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లు ఈ ప్రయోజనాలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక, కియా మోడల్, వేరియంట్, స్టాక్ లభ్యత ఆధారంగా ఆఫర్లు మారవచ్చని, ఇవి పరిమిత కాలం వరకే వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Read Also: IP68+IP69 రేటింగ్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g Power (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

ఇక, కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ & మార్కెటింగ్) అతుల్ సూద్ మాట్లాడుతూ.. ఏడాది పొడవునా కియాపై నమ్మకం ఉంచిన వినియోగదారులకు కృతజ్ఞతగా ఈ క్యాంపెయిన్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. డిజైన్, ఆధునిక టెక్నాలజీ, భద్రత, ప్రీమియం ఓనర్‌షిప్ అనుభవాన్ని అందిస్తూనే, ఏడాది చివర్లో కార్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని తెలిపారు.

Exit mobile version