Site icon NTV Telugu

గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 2,00,000 వరకు తగ్గనున్న KIA India Cars ధరలు..!

Kia

Kia

KIA India Cars: కియా ఇండియా (KIA India) తమ వినియోగదారుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. జీఎస్టీ స్లాబ్స్ మార్పు, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 2.25 లక్షల వరకు తగ్గింపులు లభించనున్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 22, 2025 వరకు భారతదేశంలోని అన్ని కియా షోరూంలలో అందుబాటులో ఉంటుంది. అయితే రాష్ట్రాలను అనుసరించి ధరల తగ్గింపులు ఉన్నాయి. వినియోగదారులు సెల్టోస్, కారెన్స్ క్లావిస్, మరియు కారెన్స్ వంటి ప్రసిద్ధ మోడళ్లపై ఈ తగ్గింపులను పొందవచ్చు. అయితే, ప్రాంతాల వారీగా మొత్తం తగ్గింపులు మారుతూ ఉంటాయి.

All-Black డిజైన్, స్మార్ట్ ఫీచర్లతో TVS Jupiter 110 Special Edition స్టార్‌డస్ట్ బ్లాక్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా!

ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మాట్లాడుతూ.. భారతదేశంలో పండుగలు సంతోషం, ఐక్యత, కొత్త ప్రారంభాలకు చిహ్నం అంటూ పేర్కొంటూ.. ఈ పండుగ సీజన్‌ను మా కస్టమర్ల కోసం మరింత ప్రత్యేకంగా మార్చాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. ప్రత్యేకమైన ప్రీ జీఎస్టీ, పండుగ ఆఫర్లతో, వినియోగదారులు తమకు ఇష్టమైన కియా కారును పొందవచ్చని ఆయన తెలిపారు. కియా కారు సొంతం చేసుకోవడం అంటే కేవలం వాహనం నడపడం మాత్రమే కాదని.. రోజువారీ జీవితంలో సౌకర్యం, శైలి, సంతోషాన్ని జోడించడం కూడా అని ఆయన అన్నారు. పండుగ ప్రయాణాన్ని కియాతో ప్రారంభించాలని వినియోగదారులను మేము ఆహ్వానిస్తున్నామన్నారు.

Maoist Sujatha: పోలీసుల ఎదుట లొంగిపోయిన మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు

కొత్త కార్లు కొనుగోలు చేసే సందర్భంగా ప్రదేశం ఆధారంగా వివిధ తగ్గింపులు ఉన్నాయి. సెల్టోస్ మోడల్‌కి ఉత్తర భారతదేశంలో రూ.1,75,000 వరకు తగ్గింపు ఇవ్వబడుతున్నప్పటికీ, కారెన్స్ క్లావిస్ మోడల్‌కు రూ.1,45,500 వరకు, అలాగే కారెన్స్ మోడల్‌కు రూ.1,26,500 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇవే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సెల్టోస్ మోడల్‌పై భారీగా రూ.2,00,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే కారెన్స్ క్లావిస్ మోడల్‌కి రూ.1,33,350 వరకు, కారెన్స్ మోడల్‌కి రూ.1,20,500 వరకు తగ్గింపు లభిస్తోంది.

Exit mobile version