Site icon NTV Telugu

KGF Star Yash: కేజీఎఫ్ రాకీ భాయ్ వాడే లగ్జరీ కారు ఎన్ని కోట్లో తెలుసా?

Kgf

Kgf

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్‌ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారాడు. సినిమాల విషయాన్ని ప్రక్కన పెడితే యష్‌‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమట. ఆయన వద్ద కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయట. ఇటీవల, ఆయన తన భార్య రాధికా పండిట్‌తో కలిసి ఓ విలాసవంతమైన కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టైలిష్ లుక్‌తో, కూల్ హావభావాలతో కారు నుంచి దిగుతున్న వీడియో వైరల్‌ అవుతోంది.

READ MORE: IPL 2025 : ఐపీఎల్ 2025లో ఫిక్సింగ్ ముప్పు.. హైదరాబాద్ వ్యాపారవేత్తపై బీసీసీఐ అలర్ట్

అయితే.. యష్‌ వాడుతున్న స్ట్లైలిష్ కారు గురించి తెలుసుకుందాం… యష్ ప్రయాణించిన కారు టయోటా వెల్‌ఫైర్. ఈ మోడల్ భారత మార్కెట్లో హై, వీఐపీ ఎగ్జిక్యూటివ్ లాంజ్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి ఉంది. ఈ కారు హై వేరియంట్ రూ.1.39 కోట్లు, కాగా వీఐపీ ఎగ్జిక్యూటివ్ లాంజ్ వేరియంట్ ధర రూ.1.51 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. టయోటా వెల్‌ఫైర్ మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక లీటరుకు ARAI- సర్టిఫైడ్ ప్రకారం 16.35 కి.మీ మైలేజ్ అందిస్తుంది. టయోటా వెల్‌ఫైర్ యొక్క బరువు 2815 కేజీల వరకు ఉండి చాలా పెద్దదిగా ఉంటుంది.

READ MORE: Pawan Kalyan: మార్క్ శంకర్ పై అనుచిత వ్యాఖ్యలు.. అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..!

టయోటా వెల్‌ఫైర్ ప్రీమియం ఎమ్‌పివి కావడంతో, ఇది స్టాండర్డ్ ఫీచర్లు, పరికరాలను కలిగి ఉంటుంది. టయోటా వెల్‌ఫైర్ ఎమ్‌పివిలో ఎల్‌ఈడీ లాంప్స్ ఆల్‌రౌండ్, ప్రీమియం లెదర్ అపోల్స్ట్రే, రెట్రో-ఫిట్ ఎలక్ట్రానిక్-అడ్జస్టబుల్ లెగ్ సపోర్ట్స్, మిడిల్-రో కెప్టెన్ సీట్లలో హాట్ అండ్ కోల్డ్ ఫీచర్, ట్విన్-సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మిడిల్ అండ్ మూడవ వరుస ప్రయాణీకులకు పైకప్పుతో అమర్చిన 13 ఇంచెస్ ఎంటర్టైనమెట్ సీట్స్, 16-కలర్ ఛాయిస్ యాంబియంట్ లైటింగ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

READ MORE: Big Breaking : రేపు ఈ మండలాల్లో భూ భారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

టయోటా వెల్‌ఫైర్‌లో సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగులు, పనోరమిక్ వ్యూ మానిటర్ (360-డిగ్రీ కెమెరా), ఎబిడి విత్ ఇబిడి, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ డైనమిక్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ (విడిఎమ్), హై-స్పీడ్ వార్ణింగ్, సీట్-బెల్ట్ ప్రెటెన్షనర్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా వంటివి వున్నాయి. లగ్జరీలో ప్రయాణించాలనుకునే వారికి ఈ కారు అద్భుతంగా ఉంటుంది.

 

Exit mobile version