Kawasaki Z300 India Launch: భారత మార్కెట్లో కొత్త బైక్‌లపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో Kawasaki మరో స్ట్రీట్ నేకెడ్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. Kawasaki Z300 పేరుతో వస్తున్న ఈ బైక్‌ను కంపెనీ అధికారికంగా ప్రదర్శించింది. Kawasaki Z250 నిలిపివేసిన తర్వాత ఈ విభాగంలో కొత్త మోడల్ కోసం ఎదురుచూస్తున్న బైక్ ప్రియులకు Z300 ఆసక్తికరమైన ఎంపికగా మారే అవకాశం ఉంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, Kawasaki Z300 బుకింగ్స్ అక్టోబర్ 19, 2026 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 20, 2026న ఈ బైక్‌ను అధికారికంగా లాంచ్ చేయవచ్చని సమాచారం. Kawasaki Z300, కంపెనీకి చెందిన Ninja 300 ఆధారంగా రూపొందిన స్ట్రీట్ నేకెడ్ మోటార్‌సైకిల్‌గా తెలుస్తోంది. ఇందులో స్పోర్టీ లుక్‌తో పాటు, రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే డిజైన్‌పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ బైక్‌లో Kawasaki పెద్ద మోడళ్లైన Z900లో కనిపించే Sugomi డిజైన్ లాంగ్వేజ్ స్ఫూర్తి కనిపిస్తుంది. మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, అగ్రెసివ్ ట్యాంక్ ష్రౌడ్స్, ట్రిపుల్-ఎలిమెంట్ LED హెడ్‌లైట్ డిజైన్ వంటి అంశాలు బైక్‌కు ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తాయి.
Kawasaki విడుదల చేసిన వీడియోలో Z300ను గ్రీన్, బ్లాక్ రంగుల్లో చూపించినట్లు సమాచారం. అయితే భారత మార్కెట్లో అందుబాటులో ఉండే పూర్తి కలర్ ఆప్షన్లను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఈ బైక్‌లో ప్రధానంగా కనిపించే ఫీచర్లు:
అగ్రెసివ్ సూపర్నేకెడ్ డిజైన్
మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్
ట్రిపుల్-ఎలిమెంట్ LED హెడ్‌లైట్
స్పోర్టీ ట్యాంక్ ష్రౌడ్స్
టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్
రెండు వైపులా సింగిల్ డిస్క్ బ్రేకులు
టర్న్ ఇండికేటర్ల విషయంలో LED యూనిట్లకు బదులుగా హాలోజన్ యూనిట్లు.
Ninja 300లో ఉండే సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌కు బదులుగా Kawasaki Z300లో ఆధునిక TFT డిస్ప్లేను అందించనున్నట్లు సమాచారం. ఇందులో కనెక్టెడ్ ఫీచర్లు, నావిగేషన్ సదుపాయాలు ఉండవచ్చని తెలుస్తోంది. Kawasaki Z300లో Ninja 300లో ఉపయోగించే 296cc, ప్యారలల్-ట్విన్ సిలిండర్ ఇంజిన్నే అందించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్‌లో DOHC, ఒక్కో సిలిండర్‌కు నాలుగు వాల్వులు, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటాయి. భారత మార్కెట్లో Ninja 300 ఎక్స్-షోరూమ్ ధర రూ.3.34 లక్షలుగా ఉంది. కొత్త Kawasaki Z300 ధర దీనికంటే కొంత తక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

