Kawasaki Ninja 250: కవాసకి నింజా 250 విడుదల.. మిలమిల మెరిసే కొత్త కలర్స్, పవర్ఫుల్ ఇంజన్.. ధర ఎంతంటే?
- కవాసకి నింజా 250 కొత్త బైక్ విడుదల
- కొత్త నింజా 250లో శక్తివంతమైన ఇంజన్
- ఆకట్టుకునే ఫీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) తన ప్రసిద్ధ స్పోర్ట్స్ బైక్ నింజా 250 (Ninja 250)ను అప్డేటెడ్ వెర్షన్లో విడుదల చేసింది. కొత్త కలర్ ఆప్షన్స్, శక్తివంతమైన ఇంజన్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్‌ను జపాన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు.
కొత్త నింజా 250లో శక్తివంతమైన ఇంజన్
కవాసకి నింజా 250లో 249cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ను అందించింది. ఈ ఇంజన్ 39 PS పవర్, 23.5 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ కు జత చేశారు. దీంతో నగర రోడ్లతో పాటు హైవేలపై కూడా మెరుగైన పనితీరు అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Also Read
- Piaggio Sales: పియాజియో దూకుడు.. 49% అమ్మకాల వృద్ధితో కొత్త రికార్డు, వెస్పా స్కూటర్ల హవా!
- MG Comet EV: ఎంజీ కామెట్ EV కొనాలనుకుంటున్నారా? ధరలు పెంచిన కంపెనీ.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?
- Honda ZR-V: హోండా ZR-V భారత్‌లో లాంచ్.. 7.9 సెకన్లలో 100 km/h స్పీడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ప్రీమియం SUV
- Jeep Meridian: భారత్‌లో జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ విడుదల.. కొత్త ఫీచర్లు, AI అసిస్టెంట్.. ధర ఎంతంటే?
ఆకట్టుకునే ఫీచర్లు
కొత్త నింజా 250లో రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే పలు ఫీచర్లను అందించారు. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. అలాగే LED హెడ్‌లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 17-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బైక్‌ను లైమ్ గ్రీన్, డార్క్ మెటాలిక్ అనే రెండు కొత్త ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ధర ఎంత?
జపాన్‌లో కవాసకి నింజా 250 ధర 7.26 లక్షల జపనీస్ యెన్ గా నిర్ణయించారు. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.4.37 లక్షలు అవుతుంది. అయితే, దిగుమతి సుంకాలు, పన్నులు వంటి కారణాల వల్ల ఇతర దేశాల్లో ధర మారే అవకాశం ఉంది.
భారత్‌లో లాంచ్ అవుతుందా?
ప్రస్తుతం భారత మార్కెట్లో కవాసకి నింజా 300 మాత్రమే అధికారికంగా విక్రయిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 250cc ఇంజన్‌తో నింజా 250ను భారతదేశంలో విడుదల చేసే ప్రణాళిక ప్రస్తుతం కంపెనీకి లేదని తెలుస్తోంది. దీంతో భారతీయ కస్టమర్లు ప్రస్తుతం నింజా 300నే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Kawasaki Ninja 250: కవాసకి నింజా 250 విడుదల.. మిలమిల మెరిసే కొత్త కలర్స్, పవర్ఫుల్ ఇంజన్.. ధర ఎంతంటే?
-
Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. ‘శ్రీ శ్రీ’ నుంచి ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ రిలీజ్.!
-
Dhoom 4: ‘ధూమ్ 4’ నుంచి రణబీర్ కపూర్ అవుట్ ?… కొత్త హీరో కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్ వేట!
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!