India-bound 2023 Kia Seltos facelift unveiled with new exterior: కొరియన్ కార్ మేకర్ కియా తన కొత్త సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ కార్ నార్త్ కొరియా, యూఎస్ మార్కెట్లో విడుదలైంది. ఇండియన్ మార్కెట్లోకి వచ్చే ఏడాది అంటే 2023లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కియాతో పోలిస్తే మరిన్ని ఫీచర్లతో పాటు స్టైలిష్ ఇంటీరియర్ డిజైన్ తో రాబోతోంది. ఎక్స్ టీరియర్ లుక్ లో కూడా చాలా మార్పులు కనిపించబోతున్నాయి.
డ్యాష్ బోర్డు డిజైన్ చాలా వరకు అలాగే ఉన్నప్పటికీ.. టెయిల్ ల్యాంప్స్, రీప్రొఫైల్డ్ బంపర్, స్పాయిలర్ కొత్తగా కనిపించబోతున్నాయి. డ్యాష్ బోర్డుపై డిస్ ప్లే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మార్పులు ఉండనున్నాయి. డ్యూయల్ టోన్ డైమండ్ కట్ ఫినిషింగ్ అల్లాయ్ వీల్స్ కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఆకట్టుకోనుంది.
Read Also: Satyendar Jain: ఆప్ మంత్రి భోగాలు ఆహా.. జైలులోనే మసాజ్‌లు.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే 2023 మధ్యలో కానీ చివరి నాటికి కానీ సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ భారత మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. సెల్టోస్ తోనే కియా భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎస్‌యూవీగా కియా సెల్టోస్ ఉంది. దీంతో పాటు కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో కియా సోనెట్ కూడా అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేసుకుంది.
యూఎస్ మార్కెట్ లో విడుదలైన కొత్త కియా సెల్టోస్ లో 10.25-అంగుళాల ప్రధాన ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, అలాగే 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లేను పొందుపరిచారు. రెండు ఇంజిన్ల ఆఫ్షన్లతో తీసుకువచ్చారు. ఇక భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సెల్టోస్ జూన్ 2020లో రూ.9.69 లక్షల(ఎక్స్ షోరూం) ధరతో ప్రారంభం అయింది. ప్రస్తుతం సెల్టోస్ 1.4 లీటర్ జీడీఐ టర్భో పెట్రోల్, 1.5 లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ పెట్రోల్, 1.5 డిజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తోంది. అయితే కొత్తగా రాబోతున్న సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ లో కూడా ఈ ఇంజిన్లనే కొనసాగించే అవకాశం ఉంది.