New Hyundai Venue: పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, వేరియంట్ల వారిగా ధరలు ఇవే..
- హ్యుందాయ్ వెన్యూ ధరలు పెంపు..
- రూ. 5000 నుంచి రూ. 20,000 వరకు ధరల పెరుగుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Hyundai Venue: హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motor) షాక్ ఇచ్చింది. కొత్త వెన్యూ (Hyundai Venue) ధరల్ని పెంచింది. ఎంపిక చేసిన వేరియంట్లపై ఈ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదల పెట్రోల్, డీజిల్ మోడళ్లకు వర్తిస్తాయి. ధరలు రూ. 5000 నుంచి రూ. 20,000 వరకు పెరిగాయి. ప్రస్తుతం కొత్త వెన్యూ ధరలు రూ. 7.99 లక్షల నుండి రూ. 15.51 లక్షల మధ్యే (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. న్యూ అప్డేట్స్తో వచ్చిన వెన్యూ నవంబర్ 2025లో భారత్ మార్కెట్లోకి వచ్చింది.
పెట్రోల్ వేరియంట్ల ధరలు:
Also Read
- BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
- TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
* 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లో HX5 ట్రిమ్‌పై అత్యధిక ధర పెంచారు. గతంలో రూ. 9.35 లక్షలు ఉంటే, రూ. 20,000 పెరిగి రూ. 9.55 లక్షలకు చేరింది. బేస్ మోడల్ అయిన HX2 ధర రూ. 8.00 లక్షల వద్దే స్థిరంగా ఉంది. అలాగే, HX5+ (రూ. 9.99 లక్షలు), HX6T (రూ. 10.80 లక్షలు) వంటి టాప్ వేరియంట్ల ధరలలో ఎటువంటి మార్పు లేకుండా అవి యథాతథంగా కొనసాగుతున్నాయి.
* 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కలిగిన DCT వేరియంట్ల ధరలలో స్వల్ప పెరుగుదలలు నమోదయ్యాయి. వేరియంట్ల వారీగా పెరుగుదలను పరిశీలిస్తే.. HX5 DCT ధర రూ. 10.90 లక్షలు (+రూ. 9,000), HX6 DCT ధర రూ. 12.16 లక్షలు (+రూ. 9,000), HX8 DCT ధర రూ. 12.99 లక్షలు (+రూ. 5,000) గా ఉన్నాయి. బేస్ మోడల్ అయిన HX2 టర్బో ధర రూ. 8.89 లక్షల వద్దే స్థిరంగా ఉంది, అలాగే N6 (రూ. 10.65 లక్షలు), N10 DCT (రూ. 15.40 లక్షలు) వంటి N Line మోడళ్ల ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు.
డీజిల్ వేరియంట్ల ధరలు:
* 1.5-లీటర్ డీజిల్ వేరియంట్లలో చాలావాటి ధరలు రూ. 8,000 మేర పెరిగాయి. HX2 ధర ఇప్పుడు రూ. 9.87 లక్షలు, HX5 ధర రూ. 10.87 లక్షలు, HX5 AT ధర రూ. 11.81 లక్షలు, HX7 ధర రూ. 12.69 లక్షలుగా ఉన్నాయి. టాప్-ఎండ్ మోడళ్లు అయిన HX8 AT, HX10 AT ధరలు మాత్రం వరుసగా రూ. 13.69 లక్షలు, రూ. 15.51 లక్షల వద్దే యథాతథంగా కొనసాగుతున్నాయి.
సబ్-4 మీటర్ సెగ్మెంట్లో పోటీ తీవ్రం:
సబ్-4 మీటర్ విభాగంలో ఇండియాలో కార్ల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, మారుతి బ్రెజ్జా వంటి మోడళ్లు ఉన్నాయి. ఇప్పుడు హ్యుందాయ్ వెన్యూ కూడా ఇదే కేటగిరిలోకి వస్తుంది.
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?