హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈరోజు అధికారికంగా క్రెటా నైట్ ఎడిషన్‌ను దేశీయ మార్కెట్‌లో విక్రయానికి విడుదల చేసింది. ఆకర్షణీయమైన బ్లాక్ పెయింట్ స్కీమ్, అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఎస్‌యూవీ (SUV) పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో పరిచయం చేయబడింది. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 14.51 లక్షలుగా నిర్ణయించబడింది. దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 20.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది.
READ MORE: Telangana Floods: తెలంగాణ ‘రేపటి కోసం’ .. వైజయంతీ మూవీస్ ఎంత విరాళం ఇచ్చిదంటే?
క్రెటా నైట్ ఎడిషన్‌లో ప్రత్యేకత ఏమిటి?
నైట్ ఎడిషన్ ప్రాథమికంగా క్రెటా యొక్క ఆల్-బ్లాక్ ఎడిషన్. దీన్ని కంపెనీ 21 ప్రధాన మార్పులతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్ట్సీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు ఇందులో చాలా మార్పులు చేయబడ్డాయి. ఇది సాధారణ క్రెటాకు పూర్తి భిన్నంగా ఉంటుంది. బ్లాక్ కలర్ ఎక్స్‌టీరియర్, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాటీ లోగో, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లాక్ స్పాయిలర్ వంటివి క్రెటా నైట్ ఎడిషన్ అప్‌డేట్‌లలో ప్రధానంగా ఉన్నాయి. ఇంటీరియర్స్ పూర్తిగా బ్లాక్ అప్‌హోల్స్‌స్టరీ, స్టీరింగ్ వీల్‌పై లెదర్-ర్యాప్, గేర్ నాబ్‌తో అప్‌డేట్ చేశారు. మెటల్ పెడల్స్‌తో పాటు బ్రాస్ కలర్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి. సాధారణ కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా, కొనుగోలుదారులు రూ.5,000 అదనంగా చెల్లించి టైటాన్ గ్రే మ్యాటీ కలర్ వాహనాన్ని, రూ. 15,000 చెల్లించి డ్యూయల్ టోన్ కలర్స్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.
READ MORE:Puja Khedkar: పూజా ఖేద్కర్ వైకల్యం సర్టిఫికేట్ నకిలీదే.. హైకోర్టుకు పోలీసుల రిపోర్టు
శక్తి మరియు పనితీరు:
కొత్త హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ఇంజిన్ మెకానిజంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ (IVT) మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. విశేషమేమిటంటే.. ఈ కారును టైటాన్ గ్రే మ్యాట్, డ్యూయల్ టోన్ పెయింట్‌లో వరుసగా రూ. 5,000, రూ. 15,000 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. బ్లాక్ కలర్ ఎక్స్‌టీరియర్, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాటీ లోగో, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లాక్ స్పాయిలర్ వంటివి క్రెటా నైట్ ఎడిషన్ అప్‌డేట్‌లలో ప్రధానంగా ఉన్నాయి. ఇంటీరియర్స్ పూర్తిగా బ్లాక్ అప్‌హోల్స్‌స్టరీ, స్టీరింగ్ వీల్‌పై లెదర్-ర్యాప్, గేర్ నాబ్‌తో అప్‌డేట్ చేశారు. మెటల్ పెడల్స్‌తో పాటు బ్రాస్ కలర్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి.
READ MORE:Duleep Trophy: అనంతపురంలో జరిగే దులీప్ ట్రోఫీలో ఆడటం సంతోషంగా ఉంది.. శ్రేయాస్, గైక్వాడ్ వ్యాఖ్యలు
కొత్త ఎడిషన్ ధరలు
హ్యుందాయ్ క్రెటా 1.5 పెట్రోల్
CRETA Knight S(O) MT: రూ. 14.51 లక్షలు
CRETA Knight S(O) CVT: రూ. 16.01 లక్షలు
CRETA Knight SX (O) MT: రూ. 17.42 లక్షలు
CRETA Knight SX (O) CVT: రూ. 18.88 లక్షలు
హ్యుందాయ్ క్రెటా 1.5 డీజిల్
CRETA Knight S(O) MT: రూ. 16.08 లక్షలు
CRETA Knight S(O) AT: రూ. 17.58 లక్షలు
CRETA Knight SX (O) MT: రూ. 19 లక్షలు
CRETA Knight SX (O) AT: రూ. 20.15 లక్షలు