NTV Telugu Site icon

Hyundai Super Delight March Offer: కార్లపై ఆఫర్ల వర్షం.. ఆ మోడల్ పై రూ. 55 వేల డిస్కౌంట్

Hundai

Hundai

కంఫర్ట్ జర్నీ కోసం ఎక్కువ మంది కారునే ప్రిఫర్ చేస్తుంటారు. సొంతకారు ఉండాలని కలలు కంటుంటారు. మీరు కూడా కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే మంచి సమయం. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) మార్చిలో కస్టమర్ల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. హ్యుందాయ్ సూపర్ డిలైట్ మార్చ్ అనే ఈ ఆఫర్‌ పేరిట పలు మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్ కింద వెన్యూపై రూ. 55,000, ఎక్స్‌టీరియర్‌పై రూ. 35,000, i20పై రూ. 50,000, గ్రాండ్ i10 నియోస్‌పై రూ. 53,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

Also Read:WhatsApp: వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగింపు.. అడ్మిన్‌ని కాల్చి చంపిన వ్యక్తి..

హ్యుందాయ్ సూపర్ డిలైట్ మార్చ్ ఆఫర్ ద్వారా ఎక్కువ మంది హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేయగలరని కంపెనీ విశ్వసిస్తోంది. సేల్ పెంచుకునేందుకు కంపెనీ ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్లు మార్కె్ట్ వర్గాలు భావిస్తున్నాయి. మీరు కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉంటే హ్యుందాయ్ అందించే ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది. 4 మీటర్ల లోపు కాంపాక్ట్ SUV వెన్యూ పై రూ. 55,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

Also Read:BMW C 400 GT: స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లతో బీఎమ్ డబ్ల్యూ కొత్త స్కూటర్.. ధర తెలిస్తే గుండె గుభేలే

అదే సమయంలో, మీరు స్మాల్, స్టైలిష్ కారును ఇష్టపడితే, ఎక్స్‌టీరియర్‌పై రూ. 35,000 వరకు ఆదా చేయవచ్చు. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ i20 పై రూ. 50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో, మీరు సరసమైన, ఫ్యామిలీ కారు కోసం చూస్తున్నట్లయితే గ్రాండ్ i10 నియోస్‌పై రూ. 53,000 వరకు తగ్గింపు పొందవచ్చు. హ్యుందాయ్ కార్లు అడ్వాన్డ్స్ టెక్నాలజీ, అద్భుతమైన కనెక్టివిటీ, భద్రత వంటి మరెన్నో ఫీచర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంటాయి.