NTV Telugu Site icon

Honda Elevate: హోండా ఎలివేట్ SUV ధరలు ప్రకటన.. రూ. 11 లక్షల నుంచి ప్రారంభం..

Honda Elevata

Honda Elevata

Honda Elevate: జపనీస్ కార్ మేకర్ హోండా తన ఎలివేట్ ఎస్‌యూవీ కార్ రేట్లను ప్రకటించింది. హోండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ మార్కెట్ లోకి ఈ కారును ఇంట్రడ్యూస్ చేసింది. ఇండియాలో ఇటీవల కాలంలో ఎస్‌యూవీ కార్ మార్కెట్ పెరుగుతుండటంతో హోండా కూడా దీనిపై దృష్టి సారించింది. భారతీయులు అభిరుచిని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండేలా చూసుకుంది. ఈ సెగ్మెంట్ లో ఇతర కార్లతో పోలిస్తే మెరుగైన ఫీచర్లు అందించామని హోండా చెబుతోంది.

ఎలివేట్ ప్రారంభ ధర రూ. 11లక్షలు (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతాయని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు కార్ డెలివరీలు అందించనుంది. ఈ సెగ్మెంట్ లో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటాలకు, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వననుంది.

మొత్త నాలుగు వేరియంట్లలో హెండా ఎలివేట్ లభ్యమవుతోంది. మాన్యవల్, CVT ట్రాన్స్‌మిషన్లలో వస్తోంది. ధరలను పరిశీలిస్తే(ఎక్స్ షోరూం)

వేరియంట్   మాన్యువల్      CVT (ధర లక్షల్లో)

sv                   రూ.10.99                  –

v                     రూ.12.10           రూ.13.20

VX                  రూ.13.49         రూ.14.59

ZX                  రూ.14.89          రూ.15.99

హోండా ఎలివేట్ లో హెండా సిటీలో ఉన్నట్లుగానే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 121 బీహెచ్‌పీ శక్తిని, 145 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ట్రాన్స్మిషన్లలో అందుబాటులో ఉంది.

ఫీచర్స్:

ఫీచర్ల విషయానికి వస్తే టెక్ లోడెడ్ గా ఈ కార్ వస్తోంది. ముందు బాగాంలో పెద్ద బ్లాక్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్ ని ఇచ్చారు. టెయిల్ ల్యాంప్ ర్యాపరౌండ్ స్టైల్ ఎల్ఈడీ, 17 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్లలో 10.25 ఇంచ్ ఐపీఎస్ హెచ్‌డీ టచ్ డిస్ ప్లే, 7 ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇతర ఫీచర్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, బ్రౌన్ లెథెరెట్ అప్హోల్స్టరీ మరియు సన్‌రూఫ్ ఉన్నాయి. హోండా సెన్సింగ్ ప్యాకేజీ కింద వచ్చే అనేక ADAS ఫీచర్లను కూడా జోడించింది. ఇందులో లాన్‌వాచ్ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, కొలిజన్ ఎగవేత బ్రేకింగ్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.