NTV Telugu Site icon

Car Discount: 26కి.మీ మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్స్‌ కలిగిన ఈ కారుపై.. రూ.90వేలు డిస్కౌంట్

Honda Cars

Honda Cars

హోండా కార్స్ ఇండియా ఈ నెలలో తన పోర్ట్‌ఫోలియో లగ్జరీ సెడాన్ సిటీపై భారీ తగ్గింపులను తీసుకొచ్చింది. జనవరిలో ఈ సెడాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 90 వేల నగదు తగ్గింపును పొందవచ్చు. వాస్తవానికి.. కంపెనీ సాధారణ వేరియంట్‌పై రూ. 73,000 వరకు ప్రయోజనాలను అందుబాటులో ఉంచింది. సిటీ ఈహెఈవీపై రూ. 90,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇదిలా ఉండగా.. జనవరిలో ఎప్పుడైనా కంపెనీ తన కార్ల ధరలను మళ్లీ పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ కారును త్వరగా కొనడం ఉత్తమం.

READ MORE: Mumbai : అక్కను ఎక్కువగా ప్రేమిస్తుందని.. తల్లిని పొడిచి చంపిన కూతురు

హోండా సిటీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 11.82 లక్షలు. టాప్-ఎండ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.35 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అదే సమయంలో.. హైబ్రిడ్ వెర్షన్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 19 లక్షల నుంచి రూ. 20.55 లక్షల మధ్య ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెదర్ అప్హోల్స్టరీ, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు హోండా సిటీలో అందించారు.

READ MORE: MLC Kavitha: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే..

హోండా సిటీలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 121bhp శక్తిని,145Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్టెప్ సీబీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 1.5-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 17.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అయితే 1.5-లీటర్ సీవీటీ వేరియంట్ 18.4 kmpl మైలేజీని ఇస్తుంది. హైబ్రిడ్ మోడల్ మైలేజ్ 26.5Km/l వరకు ఉంటుంది. సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్‌వ్యూ కెమెరా, ఈబీడీ, ఏడీఏఎస్, ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Show comments