Honda: ద్విచక్ర వాహనాలను కొనబోయే వారికి భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18%కు తగ్గించడంతో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఆ ప్రయోజనాలను తమ కస్టమర్లకు పూర్తిగా బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల హోండా స్కూటర్లు, 350cc లోపు మోటార్‌సైకిళ్ల ఎక్స్-షోరూమ్ ధరలు మోడల్‌ను బట్టి రూ. 18,800 వరకు తగ్గనున్నాయి.
Hyderabad: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో బడా మోసం.. రూ.1000 కోట్ల వసూళ్లు..!
ఈ సందర్భంగా, HMSI సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ జీఎస్టీ తగ్గింపు నిర్ణయం స్వాగతించదగినది. ఇది వ్యక్తిగత రవాణాను మెరుగుపరచడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని ఆయన అన్నారు. పండుగ సీజన్ వస్తున్న సమయంలో.. ఈ ధరల తగ్గింపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మంది కస్టమర్లకు చేరువకావడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం కస్టమర్లకు మాత్రమే కాకుండా, డీలర్లు, సరఫరాదారులు, స్థానిక వ్యాపారాలపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది అని తెలిపారు.
Realme P3 Lite 5G: మిలిటరీ గ్రేడ్ రెసిస్టెన్స్, 6000mAh బ్యాటరీ మొబైల్ కేవలం పదివేలకే అందుబాటులోకి?
హోండా ఈ ధరల తగ్గింపును పూర్తిగా తమ కస్టమర్లకు అందిస్తోంది. అయితే, 40% జీఎస్టీ స్లాబ్ ఉన్న ప్రీమియం మోటార్‌సైకిళ్లపై పడే ప్రభావాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం, ప్రతి ఏ మోడల్‌పై ఎంత ధర తగ్గిందో తెలుసుకోవడానికి కస్టమర్లు తమ సమీపంలోని హోండా డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చని ఆయన తెలిపారు. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, హోండా సంస్థ తమ వాహనాల ధరలను తగ్గించి, వినియోగదారులకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తోంది.
