జపాన్ ఆటో కంపెనీలు హోండా, నిస్సాన్ విలీనాన్ని ప్రకటించాయి. రెండు కంపెనీలు సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయని నిస్సాన్ సీఈవో తెలిపారు. ఈ విలీనం తర్వాత అమ్మకాల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో కంపెనీ ఉనికిలోకి రానుంది. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం పెను మార్పుల దశకు చేరుకోవడం చూస్తున్నాం. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనంపై ఆధారపడటాన్ని తొలగిస్తూనే మరోవైపు చైనా ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం ఈ కంపెనీలకు కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Sunny Leone: సన్నీ లియోన్, వైఫ్ ఆఫ్ జానీ సిన్స్ కి నెల నెలా రూ.1000 ప్రభుత్వ సాయం
ఈ సందర్భంగా.. నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మకోటో ఉచిడా(Makoto Uchida) మాట్లాడుతూ.. “ఈ విలీనం విజయవంతమైతే.. వినియోగదారులకు తక్కువ ధరలకు మెరుగైన ఉత్పత్తులను అందించగలమని ఆశిస్తున్నాం. జపాన్‌లోని ఆటో కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ప్రత్యర్థుల కంటే వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడు ఖర్చులను తగ్గించుకోవడానికి, నష్టాలను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.” అని పేర్కొన్నారు.
READ MORE: Mohan Babu: మోహన్ బాబుకు హైకోర్టు షాక్
అయితే.. ఈ నెల ప్రారంభంలో విలీనానికి అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రెండు సంస్థల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం వెలువడింది. ఈ నేపథ్యంలో విలీనం, మూలధన వ్యయ ఒప్పందాలతో సహా అనేక అవకాశాలను హోండా పరిశీలిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా గత బుధవారం తెలిపారు. అయితే దీనిపై పూర్తి సమాచారం చెప్పేందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం ఈ విలీనం ప్రక్రియ విజయవంతం అయితే.. హోండా, నిస్సాన్ సంయుక్తంగా వాహనాల వార్షిక ఉత్పత్తిని 74లక్షలకు తీసుకెళ్లనున్నాయి. దీంతో టయోటా, వోక్స్‌వ్యాగన్ తర్వాత వాహనాలు విక్రయాల ద్వారా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్‌గా అవతరించనుంది.