NTV Telugu Site icon

Honda Amaze Facelift: న్యూ డిజైన్‌తో లాంచ్ అవుతున్న హోండా అమేజ్.. ఫీచర్లు, వివరాలివే..!

Honda Amaze Facelift

Honda Amaze Facelift

హోండా న్యూ అమేజ్ కొత్త డిజైన్‌తో త్వరలో విడుదల కానుంది. డిసెంబర్ 4న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ కారు పూర్తిగా కొత్త డిజైన్‌తో ముందుకు వస్తుంది.. దీనిని మినీ హోండా సిటీగా పిలుస్తున్నారు. కొత్త హోండా అమేజ్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.. తదితర వివరాలకు సంబంధించి తెలుసుకుందాం.

Read Also: Geyser Explodes: స్నానం చేస్తుండగా గీజర్ పేలి నవ వధువు మృతి..

కొత్త హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ఈసారి కొత్త రంగులో కనిపించనుంది. ఇది ప్రస్తుత మోడల్ లాగా రేడియంట్ రెడ్ మెటాలిక్‌గా వస్తుంది. ఈ కారు పెద్ద గ్రిల్‌తో కొత్త ముఖభాగాన్ని పొందుతుంది. ఈ గ్రిల్ పైన క్రోమ్ బార్ కనిపిస్తుంది.
ఈ కారు హెడ్‌లైట్లు LED DRLలుగా వస్తున్నాయి. అలాగే.. బంపర్స్, ఫాగ్ లైట్లు రీడిజైన్ చేశారు. ఫ్రంట్ విండ్‌స్క్రీన్ ఇప్పుడు రెయిన్-సెన్సింగ్ వైపర్‌ల కోసం సెన్సార్‌తో వస్తుంది. ఈ కారు వెనుక భాగంలో కొత్త బంపర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, కొత్త టెయిల్ లైట్లు కనిపిస్తాయి.

Read Also: Tirumala: తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం

కొత్త అమేజ్ ఇంటీరియర్‌లో చాలా మార్పులు చేశారు. కొత్త స్టీరింగ్ వీల్‌తో పాటు.. డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌ కొత్త డిజైన్‌తో వస్తుంది. ఈ కారులో కొత్త ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది 10.2 అంగుళాలతో వస్తుంది. అలాగే.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటి ఫీచర్లు హోండా న్యూ అమేజ్‌లో చూడవచ్చు.