NTV Telugu Site icon

Passion Plus New Model 2023: రీ-ఎంట్రీ ఇచ్చిన ప్యాషన్ ప్లస్‌ బైక్.. ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ!

Hero Passion Plus

Hero Passion Plus

Hero Passion Plus Launched at Rs 76301: దేశంలోని అతిపెద్ద బైక్ తయారీదారు ‘హీరో మోటోకార్ప్’కు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే బైక్స్ రిలీజ్ చేస్తూ.. ముందుకు దూసుకుపోతోంది. అదే సమయంలో తన పోర్ట్​ఫోలియోను పెంచుకోవాలని కూడా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏళ్ల పాటు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న ‘ప్యాషన్​ ప్లస్​’ (Passion Plus 2023)ని తిరిగి రిలీజ్ చేసింది. తన ప్రసిద్ధ బైక్ ప్యాషన్ ప్లస్‌ను కొత్త అవతార్‌లో విడుదల చేసింది. శక్తివంతమైన ఇంజన్ మరియు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉన్న ఈ బైక్ ధర కూడా చాలా తక్కువ.

Passion Plus 2023 Launch:
సుమారు 3 సంవత్సరాల విరామం తర్వాత హీరో మోటోకార్ప్ కంపెనీ మళ్లీ ప్యాషన్ ప్లస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 2001లో వచ్చిన ఈ బైక్.. 2020లో నిలిపివేయబడింది. ఇప్పుడు ఈ ప్యాషన్ ప్లస్ బైక్ కొత్త అప్‌డేట్‌లతో రిలీజ్ అయింది. 3 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ బైక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2020కి ముందు అమ్మకానికి అందుబాటులో ఉన్నప్పుడు అత్యధికంగా అమ్ముడైన బైక్ మోడల్‌లలో ఇది ఒకటి. రీలాంచ్ అయిన ప్యాషన్ ప్లస్ బైక్ మునుపటి మోడల్‌ను పోలి ఉంటుంది. కానీ దాని బాడీ ప్యానెల్స్‌లో కొన్ని మార్పులు చేశారు.

Passion Plus 2023 Price:
2023 మోడల్ ప్యాషన్ ప్లస్‌ బైక్ ధర రూ.76,301 (ఎక్స్-షోరూమ్)లుగా ఉంది. మార్కెట్‌లో ఈ బైక్ మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. స్పోర్ట్ రెడ్, బ్లాక్ హెవీ గ్రే మరియు బ్లాక్ నెక్సస్ బ్లూ రంగులలో ఈ బైక్ వస్తుంది.

Also Read: Honda Unicorn Launch: సరికొత్త బైక్‌ను విడుదల చేసిన హోండా.. బెస్ట్ ఫీచర్లు! 10 సంవత్సరాల వారంటీ

Passion Plus 2023 Mileage:
2023 మోడల్ ప్యాషన్ ప్లస్‌ బైక్ మైలేజ్​ కూడా డీసెంట్​గా ఉంది. దాదాపుగా 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంచనా.

Passion Plus 2023 Features:
కొత్త ప్యాషన్ ప్లస్ బైక్‌లో 97.2 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 7.89 హెచ్​పీ పవర్​ను, 8.05 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4 స్పీడ్ ట్రాన్స్‌మిషన్​ గేర్​బాక్స్​ ఉంటుంది. ఆర్డీఈ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ నవీకరించబడింది. ఈ బైక్ దాని i3S స్టార్ట్/స్టాప్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. రీఎంట్రీలో ఈ బైక్​కి మంచి డిమాండ్​ ఉంటుందని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: OLA Electric Car Images: టెస్లాకు పోటీగా ఓలా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌పై 500 కిమీ ప్రయాణం! ధర ఎంతంటే