Harley-Davidson Street Bob 2025: అమెరికన్ క్రూజర్ బైక్స్ తయారీదారి హార్లీ-డేవిడ్‌సన్ తన తాజా మోడల్ స్ట్రీట్ బాబ్ 2025 (Street Bob 2025)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.18.77 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. 2022లో నిలిపివేసిన ఈ మోడల్, ఇప్పుడు మళ్లీ నయా లుక్ తో ప్రవేశించి భారత మార్కెట్‌లో ఫ్యాట్ బాబ్‌ను భర్తీ చేసింది. మరి ఈ కొత్త హార్లీ-డేవిడ్‌సన్ స్ట్రీట్ బాబ్ 2025 డిజైన్, ఇంజిన్, ఫీచర్లను పూర్తిగా చూసేద్దామా..
ఇంజిన్, పనితీరు:
ఈ కొత్త స్ట్రీట్ బాబ్‌లో 1,923సీసీ V-ట్విన్ ఎయిర్ లేదా లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది. అలాగే ఈ బైక్ గరిష్టంగా 91hp పవర్, 156nm టార్క్ అందిస్తుంది.
డిజైన్, లుక్:
బైక్ డిజైన్ విషయంలో కొత్త స్ట్రీట్ బాబ్, పాత వెర్షన్‌కి కాస్త దగ్గరగా ఉంటుంది. అయితే గత మోడల్‌లో ఉన్న బ్లాక్ ఎగ్జాస్ట్ స్థానంలో ఇప్పుడు క్రోమ్ ఫినిష్ టూ-ఇన్-వన్ లాంగ్‌టెయిల్ ఎగ్జాస్ట్ ను ఇచ్చారు. ఈ కొత్త మోడల్ బైక్ బిలియార్డ్ గ్రే, వివిడ్ బ్లాక్, సెంటర్ లైన్, ఐరన్ హార్స్ మెటాలిక్, పర్పుల్ అబైస్ డెనిమ్ అనే ఐదు రంగు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులోని ఏప్ హ్యాండిల్ బార్స్, బాబ్-స్టైల్ రియర్ ఫెండర్స్, స్ట్రెచ్డ్ డైమండ్ బ్లాక్ అండ్ క్రోమ్ మెడాలియన్ కొత్త ప్రత్యేకతలుగా ఉన్నాయి.
Rajiv Gandhi Jayanti: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం నివాళులు!
కొత్త స్ట్రీట్ బాబ్ 2025లో ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ప్రిలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్, నాలుగు అంగుళాల డిజిటల్-అనలాగ్ డిస్‌ప్లే, మూడు రైడ్ మోడ్‌లు (రెయిన్, రోడ్, స్పోర్ట్), USB టైప్-C చార్జింగ్ పోర్ట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇక బైక్ భద్రత విషయానికి వస్తే.. కోర్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, డ్రాగ్-టార్క్ స్లిప్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఆధునిక సాంకేతికతలు అందించనున్నారు. మొత్తంగా హార్లీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్ట్రీట్ బాబ్ 2025 మోడల్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. కాకాపతే ధర కాస్త ఎక్కవుగా ఉంది.
