Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ferrari Amalfi Spider: ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ భారత మార్కెట్లో కొత్తగా అమాల్ఫీ స్పైడర్ (Amalfi Spider) కన్వర్టిబుల్ సూపర్‌కార్‌ను విడుదల చేసింది. ఇందులో 3.9 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ను అందించారు. ఈ ఇంజిన్ 640 HP పవర్, 760 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ సూపర్‌కార్ కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 320 కిమీ/గంటగా ఉంది.
అమాల్ఫీ స్పైడర్ ప్రధాన ఆకర్షణ దాని ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ రూఫ్. ఈ రూఫ్ 13.5 సెకన్లలో తెరుచుకుంటుంది లేదా మూసుకుపోతుంది. గంటకు 60 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. నాలుగు రంగులలో రూఫ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకమైన రోస్సో ట్రామోంటో (Rosso Tramonto) ఎక్స్టీరియర్ కలర్ కూడా అందుబాటులో ఉంది.
Also Read
- Lectrix NDuro: 120KM రేంజ్‌తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
- Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
- Hero Surge S32: స్కూటర్‌ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
కారులో 2+2 సీటింగ్ లేఅవుట్ తో పాటు డ్రైవర్-ఫోకస్డ్ క్యాబిన్‌ను అందించారు. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 15.6 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 8.8 అంగుళాల ప్యాసింజర్ డిస్ప్లే, పవర్డ్ స్పోర్ట్స్ సీట్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ADAS వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
సూపర్‌కార్ అయినప్పటికీ ఉపయోగకరతను దృష్టిలో పెట్టుకుని బూట్ స్పేస్‌ను కూడా అందించారు. రూఫ్ మూసి ఉన్నప్పుడు 255 లీటర్ల బూట్ స్పేస్, రూఫ్ తెరిచినప్పుడు 172 లీటర్ల లగేజ్ సామర్థ్యం లభిస్తుంది. ఈ ఓపెన్-టాప్ గ్రాండ్ టూరర్ ప్రారంభ ధర రూ.4.60 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఆప్షన్లు మినహా)గా నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 2026లో అరంగేట్రం చేసిన కొద్ది నెలల్లోనే ఈ మోడల్‌ను భారత్‌కు తీసుకురావడం విశేషం.
తాజావార్తలు
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
-
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
-
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్‌గాంధీ, ఖర్గే
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!