Fastag New Rules: వాహనదారులపై టోల్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేవలం రూ.3000లతో ఈ పాస్ కొనుగోలు చేసి ఏడాదంతా లేదా 200 ట్రిప్పులు (ఏది ముందు వస్తే అది) జాతీయ రహదారులు, నేషనల్ ఎక్స్‌ప్రెస్ వేలపై తిరిగేందుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 15, 2025 రోజునే ఈ వార్షిక పాస్‌ల రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ యాన్యువల్ పాస్‌ల కోసం వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అయితే.. వాహనదారులు సౌకర్యార్థం కేంద్రం మరో రెండు కొత్త నియమాలు ప్రవేశ పెట్టింది. ఫాస్టాగ్ లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్‌గేట్ల వద్ద ఇప్పటి వరకు సాధారణ రుసుముకు రెండింతల మొత్తం చెల్లించాల్సి వచ్చేది.
READ MORE: Little Hearts : దుమ్ము లేపిన లిటిల్ హార్ట్స్.. మరో రికార్డు
ఈ నిబంధనలో స్వల్ప మార్పులు చేసింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు నగదు రూపంలో టోల్ చెల్లించాలనుకుంటే ఎప్పటి మాదిరిగా రెండింతలు కట్టాల్సి ఉంటుంది. కానీ.. యూపీఐ ద్వారా చెల్లిస్తే టోల్ కొంత తగ్గుతుంది. యూపీఐ ద్వారా 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదాహరణకు ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు రూ. 100 చెల్లిస్తే, ఆ సౌకర్యం లేని వాళ్లు నగదు రూపంలో అయితే.. రూ.200 చెల్లించాలి. అదే యూపీఐ ద్వారా చెల్లిస్తే మాత్రం రూ. 125 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కొత్త నిబంధనలో పేర్కొన్నారు. అదే విధంగా మీ ఫాస్టాగ్‌లో డబ్బులు ఉండి.. సక్రమంగా పని చేస్తున్నా.. టోల్ వసూలు వ్యవస్థలో లోపం ఏర్పడితే.. ఉచితంగా వెళ్లవచ్చు. మీరు ఎలాంటి నదగు లేదా యూపీఐ ద్వారా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని మరో నియమాన్ని తీసుకొచ్చారు. ఈ రెండు నియమాలు వచ్చే నెల 15 (నవంబర్ 15) నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
READ MORE: Aadi Srinivas : హరీష్ రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..
