NTV Telugu Site icon

Electric Car Catches Fire: ఎలక్ట్రిక్ కారులో మంటలు.. బెంగళూర్‌లో ఘటన..

Electric Car Catches Fire

Electric Car Catches Fire

Electric Car Catches Fire: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంలో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం చూశాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది కూడా మరణించారు. అయితే ఆ తరువాత మరింత పకడ్బందీగా కంపెనీలు ఈవీల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అయితే స్కూటర్ల విషయాన్ని పక్కన పెడితే, కార్లలో మాత్రం మంటలు చెలరేగడం చాలా అరుదుగా చూశాం.

Read Also: Health Benefits: శృంగారం తర్వాత రిలీఫ్‌ ఫీలింగ్ కలుగుతుంది.. ఎందుకో తెలుసా?

తాజాగా బెంగళూర్ లో నడిరోడ్డుపై ఓ ఎలక్ట్రిక్ కారు అగ్నికి ఆహుతైంది. కారు పూర్తిగా కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 30న బెంగళూర్‌లోని జేపీనగర్‌లో ఈ ఘటన జరిగింది.అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారు కాలిపోతున్న సమయంలో జనాలు దూరంగా దూరంగా ఉన్నారు. అటు వైపుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదు.

గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ తరహా అగ్ని ప్రమాదాలు జరిగేవి. ఇటువంటి సంఘటన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను తనిఖీ చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అనేక ఈవీ కంపెనీలు తమ తమ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేశాయి. బ్యాటరీలు పేలడానికి వేడి వాతావరణం కూడా ప్రధాన కారణంగా పరిగణించబడుతోంది.