శృంగారం త‌ర్వాత ఒక రిలీఫ్ ఫీలింగ్ క‌లుగుతుంది. ఇది ఎందుకు క‌లుగుతుంది? దీనికి కార‌ణం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 జీవుల మనుగడకు, వంశాభివృద్ధికి శృంగారం కచ్చితంగా కావాలి. కచ్చితంగా చెప్పాలంటే సెక్స్ లేకుంటే మాన‌వ మ‌నుగ‌డే లేదు.

 సెక్స్ తరువాత రిలీఫ్​ ఫీలింగ్ క‌ల‌గ‌డానికి ప్రధాన కార‌ణం ఫీల్ గుడ్ హార్మోన్స్​. మ‌న‌స్సులో సెక్స్ ప‌ర‌మైన కోరికలు ఎప్పుడు క‌లుగుతాయో.. అప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్లు విడుద‌ల‌వుతాయి.

ముఖ్యంగా డోప‌మైన్‌, సెరోటోనిన్‌, ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్‌, కార్టిసాల్ వంటి మొదలైన ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. వీటినే ల‌వ్ హార్మోన్స్ అని కూడా అంటారు.

ఈ హార్మోన్లు మ‌న‌కు సంతోషాన్ని క‌లిగిస్తాయి. ముఖ్యంగా డోప‌మైన్ అనే హార్మోన్ మూడ్‌ని పెంచుతుంది. హుషారుని క‌లిగించి మ‌న‌స్సుకు ఉల్లాసం, ఉత్తేజం కలిగిస్తుంది.

సెరోటోనిన్ అనే  హార్మోన్ మ‌న‌లోని డిప్రెష‌న్‌, డ‌ల్‌నెస్‌ను పోగొడుతుంది.

 ఆక్సిటోసిన్ హార్మోన్.. శృంగారం కోరిక‌ను, శృంగారం కావాల‌నే త‌హ‌త‌హ‌ను పెంచుతుంది. శృంగారంలో పాల్గొంటే సుఖం క‌లుగుతుంది.

శృంగారం త‌ర్వాత శరీరంలో ఎండార్ఫిన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మూడ్ అంత‌టినీ ఉల్లాసంగా మారుస్తాయి. ఫ‌లితంగా సెక్స్ అనంత‌రం మంచి నిద్ర వ‌స్తుంది.

ఈ విధంగా ఫీల్ గుడ్ హార్మోన్లు మ‌న‌స్సుకు హాయిని క‌లిగిస్తాయి. ఈ విధంగా శృంగారంలో పాల్గొన‌టం వ‌ల్ల అనేక లాభాలుంటాయి.

శృంగారం అనేది ఒక వ్యాయామంలా ప‌నిచేయ‌డంతో పాటు మ‌నిషికి మంచి రిలీఫ్, సంతోషం, నిద్రను క‌లిగించి బాధ‌ల నుంచి తాత్కాలిక విముక్తిని క‌లిగిస్తుంది.

 కొంత‌మంది దంప‌తులు గొడ‌వ ప‌డ్డ త‌ర్వాత శృంగారంలో పాల్గొంటారు. ఇది వారికి చెప్పలేని సంతోషాన్ని అందిస్తుంది. ఎందుకంటే శృంగారం అనేది వారి మూడ్‌ను  పూర్తిగా మార్చేస్తుంది.