Site icon NTV Telugu

Citroën India: టాటా కర్వ్ తో పోటీ పడుతున్న ఈ కారుపై రూ.2.80 లక్షలు తగ్గింపు..! 31 వరకే ఛాన్స్..

Citroen India

Citroen India

ప్రతి నెలా ఆటో కంపెనీలు తమ కార్ల ధరలను తగ్గిస్తూ.. కస్టమర్లకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. భారత్‌లో అగుడు పెట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సిట్రోయెన్ ఇండియా కూడా గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ కంపెనీ మొట్టమొదటి ప్రసిద్ధ కూపే ఎస్‌యూవీ సిట్రోయెన్ బసాల్ట్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఎస్‌యూవీపై మాత్రమే కాకుండా.. C3, EC3, ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లకు కూడా మంచి ప్రయోజనాలు కల్పించారు.

Read More: Mohan Bhagwat: 75 ఏళ్లకు రిటైర్ రావాలి, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై వివాదం..

సిట్రోయెన్ c3
ఈ కారుపై 1.10 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనం లభిస్తోంది. ఈ ఆఫర్ 2025 షైన్ వేరియంట్‌పై అందుబాటులో ఉంది. ఈ కారుపై కంపెనీ నగదు, లాయల్టీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కారు ధర 6.23 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి 10.21 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

సిట్రోయెన్ eC3
కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ వాహనంపై 40 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్ 2023 మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది. 2025 మోడల్‌పై ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వాహనం ధర 12.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి 13.41 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

సిట్రోయెన్ బసాల్ట్
ఇది కంపెనీకి చెందిన మొట్టమొదటి కూపే ఎస్‌యూవీ. జూలైలో ఈ కారుపై 2.8 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ ప్రయోజనం 2024 Max AT వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు ధర 8.32 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి 14.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్
ఈ కారుపై 65 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఈ ప్రయోజనం 2023 మోడళ్లపై మాత్రమే ఉంచారు. 2025 మోడల్ మ్యాక్స్ వేరియంట్‌పై నగదు, ఎక్స్ ఛేంజ్, లాయల్టీ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 8 లక్షల 62 వేలు (ఎక్స్-షోరూమ్). టాప్ మోడల్ రూ. 14 లక్షల 60 వేలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు టాటా కార్వ్ తో పోటీ పడుతోంది.

Exit mobile version