NTV Telugu Site icon

Automobile Sales in 2024: వాహనాల కొనుగోలులో నంబర్ వన్‌గా నిలిచిన రాష్ట్రం ఇదే..

Cars

Cars

వాహనాల కొనుగోలులో భారతదేశంలోని ఒక రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచింది. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వెనుకకు నెట్టింది. ఆ రాష్ట్రం ఏదీ? అనుకుంటున్నారా? అది ఛత్తీస్‌గఢ్. ఛత్తీస్‌గఢ్ ఆటోమొబైల్ రంగంలో 18.57% విపరీతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు మొత్తం 11 నెలల కాలంలో రాష్ట్రంలో 6.69 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది రాష్ట్రానికి అపూర్వ విజయం.

READ MORE: Chikkadpally Police: సినీ ప్రముఖుల ముందుకు సంధ్య థియేటర్ ఘటన వీడియోలు..

ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో వాహనాల విక్రయాలు పెరగడం వెనుక రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలదే అతిపెద్ద పాత్ర. ఇవి సామాన్య ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా బలోపేతం చేస్తున్నాయి. ఈ పథకాల ద్వారా వివిధ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు అందించడం వల్ల కొనుగోలు శక్తి పెరిగిందని నిపుణులు అంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వివిధ పెన్షన్ పథకాలు, నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలు రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సానుకూల మార్పులు తీసుకురావడంలో అతిపెద్ద పాత్ర పోషించాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పథకాల ప్రభావం జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మాత్రమే కాకుండా.. మార్కెట్ కార్యకలాపాలను కూడా పెంచింది. ఛత్తీస్‌గఢ్‌కి ఇది నిజంగా ఒక పెద్ద విజయం. ఎందుకంటే ఈ రాష్ట్రం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలను కూడా వెనక్కినెట్టేసింది.

READ MORE: Bhadrachalam: రామయ్య సన్నిధిలో కొత్త విధానం.. అన్నదాన సత్రంలో డిజిటల్​ టోకెన్లు..

Show comments